Avantika Vandanapu : ఒకప్పటి ఈ టాలీవుడ్ పాప.. ఇప్పుడు హాలీవుడ్ సెన్సేషన్.. హాలీవుడ్‌లో తెలుగమ్మాయి రచ్చ..

బ్రహ్మోత్సవం, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇప్పుడు హాలీవుడ్ ని ఊపేస్తోంది.

Avantika Vandanapu : ఒకప్పటి ఈ టాలీవుడ్ పాప.. ఇప్పుడు హాలీవుడ్ సెన్సేషన్.. హాలీవుడ్‌లో తెలుగమ్మాయి రచ్చ..

Avantika Vandanapu once upon a time Tollywood Child Artist now Sensation in Hollywood with Mean Girls Movie

Updated On : January 14, 2024 / 4:08 PM IST

Avantika Vandanapu : అవంతిక వందనపు.. అంటే ఎవరు గుర్తుపట్టరేమో. కానీ బ్రహ్మోత్సవం, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చూడగానే గుర్తుపడతారు. తెలుగమ్మాయి అవంతిక చిన్నప్పుడు బ్రహ్మోత్సవం, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, అజ్ఞాతవాసి, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం.. ఇలా పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇక్కడ పలు సినిమాల్లో నటించింది.

అయితే అవంతిక ఫ్యామిలీ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడంతో అవంతిక అక్కడ కూడా నటననే కెరీర్ గా ఎంచుకొని అక్కడ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. మొదట పలు హాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అవంతిక హాలీవుడ్ లో స్పిన్ అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసింది,. ఆ తర్వాత సీనియర్ గర్ల్ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసింది. మీన్ గర్ల్స్ అనే సినిమాతో ఇప్పుడు హాలీవుడ్ ని ఊపేస్తోంది.

Also Read : Mega 156 : మెగా 156.. ఈ సంక్రాంతికి టైటిల్.. వచ్చే సంక్రాంతికి సినిమా.. మెగాస్టార్ టార్గెట్ ఇదే..

అవంతిక ఒక మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మీన్ గర్ల్స్ సినిమా జనవరి 12న హాలీవుడ్ లో రిలీజయింది. ప్రస్తుతం ఈ సినిమా అక్కడ సెన్షేషన్ సృష్టిస్తుండగా అందులో అవంతిక పాత్ర, ఆమె డ్యాన్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మీన్ గర్ల్స్ సినిమాలోని ఆమె డ్యాన్స్ ఇక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అవంతికని ఈ రేంజ్ బోల్డ్ డ్యాన్స్ లో చూసిన తెలుగు ప్రేక్షకులు ఆ పాప ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోతున్నారు.

 

దీంతో అవంతిక హాలీవుడ్ లోనే కాక ఇక్కడ కూడా వైరల్ అవుతుంది. హాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ అవంతిక చేతిలో ఉన్నాయని సమాచారం. మన తెలుగమ్మాయి అక్కడి సినిమాల్లో మెయిన్ లీడ్ లో స్టార్ అయితే అంతకంటే గొప్పేముంది. అవంతిక చిన్నప్పటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూసి ఈ రేంజ్ లో మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.