లక్ష్మీ’స్ ఎన్టీఆర్ అవసరం: ఘంటసాల పాడలేదు

వివాదాలకు కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తున్న వర్మ.. ఈ సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి ఎంట్రీతో మొదలయ్యే ఈ కథను రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్
ఈ సినిమాకు సంబంధించి రెండవ పాటను రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేశారు. ‘అవసరం’ అంటూ సాగే పాట వీడియోను వర్మ ఉదయం విడుదల చేశారు. కళ్యాణీ మాలిక్ సంగీతంలో రూపొందిన ఈ పాటకి సిరా శ్రీ లిరిక్స్ అందించారు. విల్సన్ హరెల్డ్ ఆలపించగా.. సింగర్ వాయిస్ కాస్త ఘంటసాల వాయిస్‌లా అనిపిస్తుండడంతో వర్మ పాటపై వ్యంగ్యంగా ఈ పాటని ఘంటసాల ఆలపించలేదు అంటూ కామెంట్ చేశారు.
Here is the AVASARAM song from #LakshmisNTR and no it is not sung by GHANTASALA .. Music by @Kalyanimalik31 and lyrics by @Sirasri https://t.co/rbigoYHYFy
— Ram Gopal Varma (@RGVzoomin) March 7, 2019
ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లు నటిస్తున్నారు అయినప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వైసీపీ నాయకుడు రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో మహానటుడు సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు