Avika Gor : సౌత్‌ లో నెపోటిజం చాలా ఎక్కువ.. సౌత్ సినిమాపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన అవికా గోర్..

హిందీలో అవికా చేసిన 1920: Horrors of the Heart సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అవికా బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తుండగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై, తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Avika Gor : సౌత్‌ లో నెపోటిజం చాలా ఎక్కువ.. సౌత్ సినిమాపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన అవికా గోర్..

Avika Gor sensational comments on South film industry and Nepotism

South Movies : హిందీలో బాలికా వధూ(Balika Vadhu) సీరియల్(Serial) తో చిన్నప్పుడే ఇండియా అంతటా పేరు సంపాదించింది అవికా గోర్(Avika Gor). ఆ తర్వాత అదే సీరియల్ పలు లోకల్ భాషల్లో కూడా రీమేక్ అయి మరింత పాపులారిటీ తెచ్చుకుంది అవికా. అనంతరం చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్, సినిమాలు చేసి తెలుగులో రాజ్ తరుణ్(Raj Tarun) సరసన ఉయ్యాలా జంపాల(Uyyala Jampala) సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం తెలుగు, హిందీ, కన్నడలో వరుస సినిమాలు చేస్తోంది అవికా గోర్. త్వరలో హిందీలో అవికా చేసిన 1920: Horrors of the Heart సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అవికా బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తుండగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై, తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవికా గోర్ మాట్లాడుతూ.. స్టార్ పవర్ అంటేనే సౌత్. సౌత్ లో స్టార్స్ మీదే సినిమాలు నడుస్తాయి. నెపోటిజం బాగా విని విని అలిసిపోయిన మాట. సౌత్ లో ఇది చాలా ఎక్కువే. కానీ ఇక్కడి ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. ఇటీవల బాలీవుడ్, హిందీ సినిమాలపై తీవ్ర వివక్షత వచ్చేలా చేశారు. సౌత్ సినిమాలు చాలా రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చారు. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువే ఉంది. ప్రజలు కూడా దీన్ని బాగా హైప్ చేశారు. తర్వాత ఇది తగ్గుతుంది అనుకుంటున్నా అని తెలిపింది.

Madhu Mantena : ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న ఆర్జీవీ బామ్మర్ది, ప్రముఖ నిర్మాత.. హాజరైన బన్నీ, బాలీవుడ్ స్టార్ హీరోలు

దీంతో అవికా గోర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవికా ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి ఇలా మాట్లాడటంతో పలువురు ఫైర్ అవుతున్నారు. ఇక బాలీవుడ్ అంటేనే నెపోటిజం అనే స్థాయిలో ఉంది, తెలుగులో నెపోటిజం ఉన్నా బాలీవుడ్ అంత కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అవికా గోర్ ఇక్కడి సినిమాలు చేస్తూ ఇలా మాట్లాడటంతో విమర్శలు వస్తున్నాయి.