చిరు, కృష్ణంరాజు చుట్టూ అందమైన తారలు

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 04:28 AM IST
చిరు, కృష్ణంరాజు చుట్టూ అందమైన తారలు

Updated On : March 30, 2019 / 4:28 AM IST

మెగాస్టార్ చిరంజీవి చుట్టూ అందమైన తారలు తళుక్కున మెరిశారు. టాలీవుడ్, ఇతర వుడ్‌లలో అలనాటి నటులు. వీరంతా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కుమార్తె రిసెప్షన్‌లో సందడి చేశారు. చిరంజీవి, కృ‌‌ష్ణంరాజు దంపతులతో పాటు ఖుష్బూ, రాధిక, టబు, సుహాసిని, మీనా, జయసుధ, నదియాలు ఫొటోలు దిగారు. ఈ ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ కుమార్తె పెళ్లి రిసెప్షన్..అద్బుతమైన సాయంత్రం, మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి అని రాధిక ట్వీట్ చేయగా..హ్యాండ్సమ్ మెగాస్టార్ చిరంజీవి చుట్టూ అందమైన మహిళలు రాధిక, సుహాసిని, మీన, నదియా, టబు, ఆయన సతీమణి సురేఖ అని ఖుష్బూ పోస్టు చేశారు. 

వెంకటేష్ కుమార్తె అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం మార్చి 24వ తేదీన జైపూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి. దీనితో పెళ్లి రిసెప్షన్‌ను దగ్గుబాటి ఫ్యామిలీ మార్చి 28వ తేదీ గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతితో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు పాల్గొని నూతన వధూవరులను ఆశ్వీరదించారు.