ఫన్నీగా ఆయుష్మాన్ ఖూరానా ‘బాలా’ టీజర్

ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. 'బాలా'.. టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 26, 2019 / 12:50 PM IST
ఫన్నీగా ఆయుష్మాన్ ఖూరానా ‘బాలా’ టీజర్

Updated On : August 26, 2019 / 12:50 PM IST

ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’.. టీజర్ రిలీజ్..

అంథా దున్ సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’.. ‘ఆబా’, ‘స్త్రీ’ సినిమాల ఫేమ్ అమర్ కౌషిక్ దర్శకత్వంలో, దినేష్ విజాన్ నిర్మిస్తున్నాడు.

రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఆయుష్మాన్ ఫుల్ జోష్‌లో బైక్‌‌పై పాట పాడుకుంటూ వెళ్తుండగా.. గాలికి సడెన్‌గా తలపై ఉన్న క్యాప్ ఎగిరిపోయి అతని బట్టతల రివీల్ అవుతుంది. అప్పుడు అతనిచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూడాలి మామూలుగా లేదసలు.. ఆ దెబ్బతో జోష్ సాంగ్ కాస్తా శాడ్ సాంగ్‌గా మారిపోతుంది.. లొకేషన్‌తో సహా..

టీజర్ ఫన్నీగానూ.. ఇంట్రెస్టింగానూ ఉంది. ఆయుష్మాన్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని అర్థమవుతోంది.. సౌరభ్ శుక్లా, జావేద్ జాఫ్రీ, సీమా పావా, అభిషేక్ బెనర్జీ తదితరులు నటిస్తున్న బాలా నవంబర్ 22న రిలీజ్ కానుంది.