Pawan Kalyan : అయ్యప్పన్‌‌లో నాలుగు ఫైట్లు!

Pawan Kalyan : అయ్యప్పన్‌‌లో నాలుగు ఫైట్లు!

Ayyappan Movie Pawan Kalyan Four Fights

Updated On : June 30, 2021 / 11:32 AM IST

Pawan Kalyan : వకీల్ సాబ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమెక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ ఫుల్ మాస్ లో నటిస్తున్నారని టాక్. సినిమాకు స్క్రిప్ట్, మాటలు ఇతరత్రా విషయాల్లో త్రివిక్రమ్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. పలు కీలక మార్పులు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రధాన బలం అని అంటారు.

అంతేగాకుండా..పవన్ కోసం అద్బుతమైన ఫైట్లు కూడా ఉండనున్నాయి. ఏకంగా నాలుగు ఫైట్లు ఉండాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏమోషనల్ గా ఉండే ఈ సినిమా కోసం ఫైట్లు పెట్టడం ద్వారా..యాక్షన్ సినిమాగా మారుస్తున్నారు. హిందీ డబ్బింగ్ హక్కలు కోసం రూ. 20 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయ్యప్పన్ కోషియం తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ రీమేక్ లో పవన్ కు జోడీగా సాయిపల్లవిని తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక రానా సరసన ఐశ్వర్య రాజేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం.