One by Four : రిలీజ్ కి రెడీ అయిన వన్ బై ఫోర్.. ఎప్పుడంటే..
తాజాగా వన్ బై ఫోర్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (One by Four)
One by Four
One by Four : వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా వన్ బై ఫోర్. తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మాణంలో బాహుబలి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన పళని కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(One by Four)
తాజాగా వన్ బై ఫోర్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..
ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. వన్ బై ఫోర్ సినిమా ఒక క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒక్కో సందర్భంలో మనం టంగ్ స్లిప్ అయితే జరిగే పరిణామాలు ఊహించలేం. అలా టంగ్ స్లిప్ అయితే ఏం జరిగింది అని యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. బాహుబలికి పని చేసిన పళని గారి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి స్టైల్లో ఈ సినిమాని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించకుండా సినిమా నిర్మించాం. ఈ సినిమాని జనవరి 30న 200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.
