Bahubali The Epic: కొత్తగా వస్తున్న పాత సినిమా.. కొత్త సీన్లు సెట్, పాత సీన్లు కట్.. రాజమౌళి ‘ఎపిక్’ ప్లాన్
బాహుబలి.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు(Bahubali The Epic) అన్నీ ఇన్నీ కాదు. తెలుగులో చేసిన ఒక రీజినల్ మూవీ ప్రపంచస్థాయిలో సత్తా చాటింది అంటే అది మాములు విషయం కాదు.

'Baahubali The Epic' movie coming to the audience in a new version
Bahubali The Epic: బాహుబలి.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగులో చేసిన ఒక రీజినల్ మూవీ ప్రపంచస్థాయిలో సత్తా చాటింది అంటే అది మాములు విషయం కాదు. ఆ విషయంలో దర్శకదీరుడు రాజమౌళి ఒక యజ్ఞమే చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ సినిమాను.. అందులోను తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టింది ఈ సినిమా. రెండు(Bahubali The Epic) భాగాలుగా వచ్చిన ఈ సినిమా మొదటి భాగం రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. రెండవ భాగం ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ ఇండీస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దాంతో, ఈ సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.
Deepika Padukone: సరదా మాటలు సీరియస్ అయ్యాయి.. ఇద్దరు అన్ ఫాలో చేసుకున్నారు.. దీపికా ఎందుకిలా?
ఇప్పుడు ఈ సినిమా సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యింది. ఈసారి “బాహుబలి ఎపిక్” పేరుతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి, బాహుబలి 2 కలిపి బాహుబలి ఎపిక్ గా విడుదల చేస్తున్నారు. అయితే, ఈ రెండు భాగాల సినిమాలు కలిపి మొత్తం ఐదు నుంచి ఆరు గంటల నిడివి ఉంటుంది. కాబట్టి, ఈ రెండు సినిమాలను ట్రిమ్ చేసి విడుదల చేయబోతున్నారు. అయితే, బాహుబలి సినిమాని ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసేసున్నారు ఆడియన్స్. అలాంటిది ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తే ఎవరు చూస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది.
కానీ, ఆ ఆరు గంటల సినిమాలో ఏ సీన్స్ కట్ చేశారు, ఎలా సింక్ చేశారు, కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారా అనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఒక్క విషయం “బాహుబలి ఎపిక్” సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ ఎండింగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మరోసారి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజమౌళికి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ని అందిస్తారు అనేది చూడాలి.