Baby Collections : యూత్‌లో ‘బేబీ’ క్రేజ్.. సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఓ రేంజ్..

చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. మొదటిరోజే మూవీ బడ్జెట్ ని రాబట్టేసిన ఈ మూవీ రెండో రోజు కూడా..

Baby Collections : యూత్‌లో ‘బేబీ’ క్రేజ్.. సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఓ రేంజ్..

Baby Movie Collections and funny memes on social media

Updated On : July 16, 2023 / 12:58 PM IST

Baby Collections : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ మూవీకి కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. SKN నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రై‌యాంగులర్ లవ్ స్టోరీతో జులై 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మంచి సక్సెస్ టాక్ తెచ్చుకొని హిట్ దిశగా వెళ్తుంది. ఇక ప్రెజెంట్ లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది.

Sai Pallavi : ఆ సినిమా నన్ను ప్రేమలో పడేలా చేసింది.. సాయి పల్లవి పోస్ట్ వైరల్..!

ఈ మూవీ నుంచి రిలీజ్ అయ్యిన సాంగ్స్ అండ్ ట్రైలర్ యూత్ ని ఆకట్టుకోవడం, ముఖ్యంగా ట్రైలర్ లోని రెండు డైలాగ్స్ అబ్బాయిలను బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మొదటిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద అదిరే కలెక్షన్స్ చూసింది. ఫస్ట్ డే ఏకంగా 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 4 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ మొదటి రోజే వచ్చేసిందని సమాచారం. ఇక సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఫస్ట్ డేకి తగ్గట్టే వచ్చాయి. రెండో రోజు ఈ మూవీ 6.75 కోట్ల గ్రాస్ అందుకుంది.

Devara – Allu Arha : ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

రెండు రోజులకు గాను ఈ మూవీ 13 కోట్లకు పైగా గ్రాస్‌ని, 7 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి ఎలాంటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై సోషల్ మీడియాలో వచ్చే ఫన్నీ మీమ్స్‌ అండ్ వీడియోలు నెటిజెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మరి ఆ మీమ్స్‌ వైపు మీరు కూడా ఒక కన్నేసేయండి.