సెలవులైపోయాయ్.. సూపర్ స్టార్ – బ్యాక్ టు వర్క్

దసరా సెలవులకు భార్యా, పిల్లలతో కలిసి కొద్దిరోజుల క్రితం స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యాడు..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 08:58 AM IST
సెలవులైపోయాయ్.. సూపర్ స్టార్ – బ్యాక్ టు వర్క్

Updated On : October 12, 2019 / 8:58 AM IST

దసరా సెలవులకు భార్యా, పిల్లలతో కలిసి కొద్దిరోజుల క్రితం స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సినిమాలు, యాడ్ షూటింగులతో బిజీగా ఉండే మహేష్ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా టూర్లు వేస్తుంటాడనే సంగతి తెలిసిందే.

దసరా సెలవులకు భార్యా, పిల్లలతో కలిసి కొద్దిరోజుల క్రితం స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లాడు మహేష్. అక్కడ వివిధ లొకేషన్లలో సరదాగా గడిపిన సూపర్ స్టార్ ఫ్యామిలీ.. హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమైంది. మహేష్ తన కొడుకు గౌతమ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘బ్యాక్ టు వర్క్ అండ్ స్కూల్’ అని పోస్ట్ చేశాడు.

Read Also : ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు – అంతలోనే మరణించాడు

భార్య నమ్రతతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ‘ఈ పిక్ తర్వాత నేను పొలరాయిడ్‌కు ఫ్యాన్ అయిపోయాను.. 42 వేల అడుగుల ఎత్తులో ట్రావెల్ చేస్తున్నాం.. బ్యాక్ టు హోమ్’.. అని పోస్ట్ చేశాడు. మహేష్ బాబు త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగులో జాయిన్ అవనున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Back to work and school ???

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on