Bad Girlz : కాంపిటేషన్ లో రిలీజయి స్క్రీన్స్, షోలు పెంచుతున్న సినిమా..
తాజాగా ఈ సినిమాకు స్క్రీన్స్ పెంచడంతో పాటు సక్సెస్ మీట్ నిర్వహించారు.(Bad Girlz)
Bad Girlz
Bad Girlz : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య, రేణు దేశాయ్, యాంకర్ స్రవంతి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల డిసెంబర్ 25న రిలీజయి పాజిటివ్ టక తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమాకు స్క్రీన్స్ పెంచడంతో పాటు సక్సెస్ మీట్ నిర్వహించారు.(Bad Girlz)
బ్యాడ్ గాళ్స్ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా నిడివి చిన్నది కానీ కంటెంట్ విషయంలో మాత్రం చాలా పెద్దది. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఈ రెండు కారణాలతో మా సినిమాని అందరూ చూడొచ్చు. కరోనాలో రిలీజ్ చేసినా నా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా హిట్ అయింది. ఇప్పుడు మా బ్యాడ్ గాళ్స్ ని హిట్ చేశారు. ఎంత కాంపిటీషన్‌లో వచ్చినా మనం హిట్టు కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో నిర్మాతలున్నారు అని అన్నారు.
Also Read : Thalapathy Vijay: సినిమాలకు ఇక సెలవు.. అభిమానుల సమక్షంలో రిటైర్‌మెంట్ ప్రకటించిన విజయ్..
నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ.. థియేటర్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా షోలు, స్క్రీన్‌లు పెంచమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న కాంపీటిషన్‌లో మా చిన్న సినిమాని అద్భుతమైన సినిమాగా మార్చారు అన్నారు. నిర్మాత రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో చాలా మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి కాంపిటీషన్‌లో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాం. సినిమాకు వస్తున్న డిమాండ్ మేరకు స్క్రీన్లను, షోలను పెంచుతున్నామని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. నీలి నీలి ఆకాశం.. పాట ఎంత హిట్ అయిందో ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మంచి కంటెంట్‌తో మున్నా గారు మళ్లీ హిట్టు కొట్టారు అని తెలిపారు.
Also Read : ‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..
