డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్

డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్

Updated On : July 29, 2020 / 10:31 PM IST

సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'కొద్దిరోజులుగా మా కుటుంబ సభ్యులందరికీ కాస్త జ్వరంగా అనిపిస్తుంది. మొదటిరోజు నుంచి టెస్టులు చేయించుకుంటున్నాం. డాక్టర్లు సూచించినట్లుగానే హోం క్వారంటైన్లోనే ఉంటున్నాం' అని తెలిపారు.

మరో ట్వీట్ లో ‘మేమంతా బెటర్ గానే ఉన్నాం. ఏ లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలతో పాటు సూచనలు పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అలా జరిగితే మేం కూడా ప్లాస్మాను డొనేట్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.

 

ప్రస్తుతం రాజమౌళి RRR ప్రాజెక్టు పనిలో ఉన్నారు. కొద్ది రోజులుగా అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ లు వేసి ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.