Unstoppable episode 5 : ఇండస్ట్రీని అదుపులో పెట్టుకున్న ఆ నలుగురు నిర్మాతల్లో.. ఇద్దరు మీరే కదా?

బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. గెస్ట్స్ గా వచ్చిన అల్లు అరవింద్, సురేష్ బాబుని ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు గురించి నిలదీశాడు.

Unstoppable episode 5 : ఇండస్ట్రీని అదుపులో పెట్టుకున్న ఆ నలుగురు నిర్మాతల్లో.. ఇద్దరు మీరే కదా?

Balakrishna accused Allu Arvind and Suresh Babu of controlling the industry

Updated On : December 1, 2022 / 4:21 PM IST

Unstoppable episode 5 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. నిక్కర్చిగా మాట్లాడే బాలకృష్ణని ఈ షోకి వ్యాఖ్యాతగా పెట్టి.. చంద్రబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు వంటి ఎంతోమంది సినీరాజకీయ నాయకుల జీవితాల్లో దాగున్న పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తుండడంతో, అన్‌స్టాపబుల్‌ షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది.

Unstoppable episode 5 : నెపోటిజం గురించి అల్లు అరవింద్‌ని నిలదీసిన బాలయ్య..

కాగా ఈసారి టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబుని అథిలుగా ఆహ్వానించిన బాలయ్య.. వారిద్దరిని ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు గురించి నిలదీశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని నేడు విడుదల చేశారు షో నిర్వాహుకులు. అయితే గత కొంతకాలంగా ఒక నలుగురు నిర్మాతలు టాలీవుడ్ ని వారి అదుపులో పెట్టుకున్నారు అంటూ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయం గురించి అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ, ఈ బడా నిర్మాతలను ప్రశ్నించాడు. ఇండస్ట్రీని అదుపులో పెట్టుకున్న ఆ నలుగురు నిర్మాతల్లో, ఇద్దరు మీరే కదా? అని అడిగిన ప్రశ్నకు.. ఈ ఇద్దరి నిర్మాతలు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మాత్రం ప్రోమోలో చూపించలేదు. మరి ఈ ఆరోపణను అరవింద్ అండ్ సురేష్ అంగీకరిస్తారా? లేదా? అనేది ఎపిసోడ్ విడుదలయ్యాక చూడాలి.