Akhanda 2 : ఏంటి అఖండ 2 రేపు రిలీజ్ అయిపోద్దా? సమస్యలన్నీ తీరినట్టేనా?
చివరి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులతో అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయింది (Akhanda 2)
Akhanda 2
Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బాలయ్య బాబు అఖండ 2 సినిమా నేడు రిలీజ్ అవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం అఖండ 2 నిర్మాతలపై తమిళనాడులో ఈరోస్ సంస్థ 28 కోట్ల నష్టాలు కట్టాలని అప్పటి వరకు సినిమా ఆపాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడమే. అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఫైన్షియర్స్ డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారట.(Akhanda 2)
దీంతో చివరి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులతో అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు అన్ని కలిపి అఖండ 2 నిర్మాతలు దాదాపు 50 కోట్లు క్లియర్ చేయాలట. నిన్నటి నుంచే నిర్మాతలు ఎంతగానో ప్రయత్నిస్తున్నా అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం కొంత డబ్బు కట్టి, కొంత తర్వాత ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారని, కోర్టుకు కూడా సినిమా రిలీజ్ పర్మిషన్ ఇవ్వాలని వెళ్లారట అఖండ 2 నిర్మాతలు.
మద్రాసు కోర్టులో ఈ కేసు వ్యవహారం తేలితే ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలు వేసి రేపట్నుంచి అంటే డిసెంబర్ 6 శనివారం నుంచి అధికారికంగా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి నేడు మద్రాస్ హైకోర్టులో అఖండ 2 నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వస్తుందా, సినిమా రిలీజ్ అవుతుందా లేక వాయిదా తప్పదా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
