Bhagavanth Kesari : రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చేసిన ‘భగవంత్ కేసరి’.. దసరాకి రావడం..!
భగవంత్ కేసరి దసరాకు రావడం కష్టం అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది.

Balakrishna Bhagavanth Kesari is no postponed Sreeleela
Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజులు నుంచి ఈ మూవీ చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన చంద్రబాబు అరెస్ట్ తో బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో భగవంత్ కేసరి షోట్టింగ్ కి బ్రేక్ పడింది.
Ganapath : దసరా రేసులో మరో పాన్ ఇండియా సినిమా.. విజయం ఎవరిది..?
సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడం, బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీ దసరాకి రావడం కష్టమని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా మూవీ టీం దీని పై ఒక క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి.. పోస్ట్‌పోన్ వార్తలకు చెక్ పెట్టేశారు. ఇక ఈ క్లారిటీతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా, శ్రీలీల (Sreeleela) బాలయ్య కూతురిగా నటిస్తున్నారు.
Team #BhagavanthKesari wishes everyone a blissful Vinayaka Chavithi ❤️
Celebrate the mighty arrival of Lord Ganesha with #GaneshAnthem ?
In Cinemas from OCT 19th?#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MusicThaman @MsKajalAggarwal… pic.twitter.com/0BjyMlA2CS
— Shine Screens (@Shine_Screens) September 18, 2023
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఫాదర్ సెంటిమెంట్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.