Bhagavanth Kesari : ఆరు రోజుల్లోనే సెంచరీ కొట్టిన భగవంత్ కేసరి.. హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు..

బాలయ్య బాబు ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించారు. ఇప్పుడు భగవంత్ కేసరితో కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య బాబు.

Bhagavanth Kesari : ఆరు రోజుల్లోనే సెంచరీ కొట్టిన భగవంత్ కేసరి.. హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు..

Balakrishna Bhagavanth Kesari Movie Collects more than 100 crores in just six days

Updated On : October 25, 2023 / 11:07 AM IST

Bhagavanth Kesari : బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్ర‌లో నటించి మెప్పించింది.

బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది. దీంతో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా మొదటి రోజే 33 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అదరగొట్టింది.

Also Read : Rana Daggubati : చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా ‘మెగా 156’లో విలన్‌గా రానా దగ్గుబాటి? బాహుబలిని మించి..

మూడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన భగవంత్ కేసరి ఆరు రోజుల్లో 104 కోట్లు కలెక్ట్ చేసి సెంచరీ కొట్టింది. భగవంత్ కేసరి సినిమా ఆరు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్య బాబు ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించారు. ఇప్పుడు భగవంత్ కేసరితో కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య బాబు. అలాగే అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్స్ కి దూసుకెళ్తుంది భగవంత్ కేసరి. ఇక సినిమాలో దంచవే మేనత్త కూతురు రీమిక్స్ సాంగ్ ని నేటి నుంచి థియేటర్స్ లో యాడ్ చేస్తున్నట్టు సమాచారం.