Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ నేడే స్ట్రీమింగ్.. సీఎంతో బాలయ్య..

BalaKrishna Chandrababu Naidu Unstoppable season 4 first episode streaming today
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు అలాగే రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోతో మరింత బిజీ కానున్నారు. ఇప్పటికే మూడు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ఈరోజు నుండి ఆహాలోసీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇటీవల మొదటి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో సైతం విడుదల చెయ్యగా సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ ఆడుకుంటుంది.
అయితే మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. షోలో బాబు చాలా విషయాలను పంచుకున్నారు. జైలులో తను అనుభవించిన నరకయాతన గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. బాబు ఎమోషనల్ అవ్వడం చూసిన అక్కడి ఆడియన్స్ సైతం ఏడ్చేశారు.
Also Read ; KA Trailer : కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయిందిగా..
ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సీజన్ 4 చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఈరోజు ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈరోజు సీజన్ 4 లో బాబు ఎపిసోడ్ కోసం ఇటు బాలయ్య ఫాన్స్ తో పాటు టీడీపీ కార్యకర్తలు సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ షో నేడు రాత్రి 8:30 గంటలకి స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రోమోలో బాబు మాట్లాడింది కొంతవరకు చూపించారు. ఇప్పటికే గతంలో ఓ సీజన్ లో వచ్చిన బాబు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఇంకెన్ని విషయాలు తెలుపుతారో చూడాలి.
పవన్ కళ్యాణ్ గురించి కూడా బాబు షోలో ప్రస్తావించడంతో మరింత ఆసక్తిగారంగా మారింది. ఇన్ని రోజులు ప్రజల్లో మెదులుతున్న మరెన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు బాబు. అయితే షోలో పవన్ తో స్నేహం ఎలా కుదిరింది అన్న విషయం గురించి క్లారిటీ ఇచ్చారట బాబు. జైల్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు, ఎన్టీఆర్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. అలాగే తన భార్య, కోడలు బ్రాహ్మిణి గురించి కూడా ఇంట్రస్టింగ్ విషయాలు తెలియచేసారు. అనంతరం బాలయ్య.. బాబుతో కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా ఆడించారు. మొత్తానికి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందట.