KA Trailer : కిర‌ణ్ అబ్బ‌వరం ‘క’ ట్రైల‌ర్‌ రిలీజ్.. అదిరిపోయిందిగా..

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న మూవీ క‌.

KA Trailer : కిర‌ణ్ అబ్బ‌వరం ‘క’ ట్రైల‌ర్‌ రిలీజ్.. అదిరిపోయిందిగా..

Kiran Abbavaram KA Movie Trailer Released

Updated On : October 25, 2024 / 10:10 AM IST

KA Trailer : టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న మూవీ ‘క‌’. సుజీత్, సందీప్ ఇద్ద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. న‌య‌న్ సారిక‌, త‌న్వి రామ్ క‌థానాయిక‌లు. భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, టీజ‌ర్‌, రెండు పాట‌లు అల‌రించాయి. ఇక ఈ మూవీ దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Matka Second single : తస్సాదియ్యా.. వ‌రుణ్‌తేజ్ మ‌ట్కా నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్‌..

కాగా.. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ‘క’ సినిమా ట్రైలర్ చూస్తే.. కృష్ణగిరి అనే ఓ ఊళ్ళో ఊరిలో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమని ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు బెదిరిస్తున్నారు అని ఆసక్తిగా సినిమా ఉండబోతున్నట్టు, చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా క ట్రైలర్ చూసేయండి..