Balakrishna – Dulquer : నాకు, మోక్షజ్ఞకు నువ్వు స్క్రిప్ట్ రాయి.. నీకు, మీ నాన్నకు నేను రాస్తా.. దుల్కర్ కు బాలయ్య బంపర్ ఆఫర్..
బాలకృష్ణ దుల్కర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Balakrishna gives Bumper Offer to Dulquer Salmaan in Aha Unstoppable Show
Balakrishna – Dulquer : ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలయిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా ఈ టాక్ షో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ టీమ్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ వచ్చి సందడి చేసారు.
అయితే షోలో దుల్కర్ తండ్రి మమ్ముట్టి ప్రస్తావన రావడంతో బాలయ్య.. మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ అంటూ మమ్ముట్టి గురించి మాట్లాడారు. అలాగే మమ్ముట్టికి లైవ్ లో వీడియో కాల్ చేసి మాట్లాడారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రస్తావిస్తూ నువ్వు, మీ నాన్న ఎప్పుడు కలిసి నటిస్తారు అని దుల్కర్ ని అడగ్గా.. నేను కూడా ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు.
Also Read : Dulquer – Sai Durgha Tej : దుల్కర్‌తో కలిసి యాక్టింగ్ నేర్చుకున్న మెగా మేనల్లుళ్లు.. ఎక్కడో తెలుసా?
ఈ క్రమంలో బాలకృష్ణ దుల్కర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలయ్య దుల్కర్ తో.. నాకు, మా అబ్బాయికి నువ్వు స్క్రిప్ట్ రాయి, నీకు మీ నాన్నకు నేను స్క్రిప్ట్ రాస్తాను అని అన్నారు. బాలయ్య సరదాగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఇటీవలే తన మొదటి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య, మోక్షజ్ఞ – మమ్ముట్టి, దుల్కర్.. ఇలా తండ్రీకొడుకులు ఫ్యూచర్ లో కలిసి నటిస్తారేమో చూడాలి.