Dulquer – Sai Durgha Tej : దుల్కర్‌తో కలిసి యాక్టింగ్ నేర్చుకున్న మెగా మేనల్లుళ్లు.. ఎక్కడో తెలుసా?
దుల్కర్ తాను యాక్టర్ ఎలా అయ్యాడు అనేది చెప్తూ మెగా మేనల్లుళ్లు గురించి మాట్లాడాడు.

Dulquer Salmaan Acting Course done with Sai Durgha Tej and Vaishnav Tej
Dulquer – Sai Durgha Tej : దుల్కర్ సల్మాన్ నేడు లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వెళ్లారు లక్కీ భాస్కర్ టీమ్. ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 4 రెండో ఎపిసోడ్ లో దుల్కర్ తో పాటు మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ వచ్చి సందడి చేసారు.
ఈ షోలో లక్కీ భాస్కర్ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దుల్కర్ అనేక విషయాలను తెలిపాడు. ఈ క్రమంలో తాను యాక్టర్ ఎలా అయ్యాడు అనేది చెప్తూ మెగా మేనల్లుళ్లు గురించి మాట్లాడాడు.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో ట్రైన్ ఫైట్ మాములుగా ఉండదు.. తమన్ ట్వీట్ వైరల్..
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అసలు నేను సినిమా రంగానికే వద్దామనుకోలేదు. కానీ నేను చదివే సమయంలో అసలు ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేని నా ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, సినిమా ప్రయత్నాలు చేసేవాళ్ళు. దాంతో నాకు కూడా ట్రై చేయాలి అనిపించింది. యాక్టర్ అయితే నాన్న(మమ్ముట్టి)తో కంపేర్ చేస్తారు అని డైరెక్టర్ అవుదామనుకున్నాను. యాక్టింగ్ అంటే నాకు భయం కూడా. కానీ చివరకు యాక్టింగ్ లోకే వచ్చాను. ముంబైలో బారిజోన్ యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అక్కడ నా క్లాస్ మేట్స్. ఇంకొంతమంది కూడా ఉన్నారు అని తెలిపాడు.