Balakrishna : ‘మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు..’ బాలయ్య రీ రిలీజ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్.. విన్నారా?
రీ రిలీజ్ కోసం కొత్తగా రాసిన లక్ష్మీ నరసింహ సాంగ్ మీరు కూడా వినేయండి..

Balakrishna Lakshmi Narasimha Movie Re Release Special Song Released
Balakrishna : బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహ జూన్ 8న రీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ని రాసి తాజాగా రిలీజ్ చేసారు. సినిమాలో దేవుడ్ని పిలిచావంటే రాడు.. అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ప్లేస్ లో ‘మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు..’ అనే లిరిక్స్ తో కొత్త సాంగ్ రాసారు.
Also Read : Manchu Vishnu : ఇలా కూడా సేవ్ చేసుకుంటారా? అసలు పేర్లే లేకుండా.. ఇది మంచు విష్ణు స్టైల్..
ఈ సాంగ్ ని చంద్రబోస్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో స్వరాజ్ కీర్తన్ పాడారు. బాలయ్య బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ పేరు వాడటంతో ఈ పాట వైరల్ గా మారింది. రీ రిలీజ్ కోసం కొత్తగా రాసిన లక్ష్మీ నరసింహ సాంగ్ మీరు కూడా వినేయండి..