Tejaswini : ఇండస్ట్రీలో మరో మహిళా వారసురాలు.. నిర్మాతగా బాలయ్య రెండో కూతురు??

తాజాగా అదేబాటలో ఇప్పుడు బాలయ్య రెండో కూతురు తేజ‌స్విని కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి వర్క్ చేసింది అని సమాచారం. అలాగే బాలయ్య....................

Tejaswini : ఇండస్ట్రీలో మరో మహిళా వారసురాలు.. నిర్మాతగా బాలయ్య రెండో కూతురు??

Balakrishna second daughter Tejaswini entry into film industry

Updated On : October 17, 2022 / 12:41 PM IST

Tejaswini :  సినీ పరిశ్రమలోకి వారసులు రావడం చాలా మాములు విషయం. చాలా మంది సినీ పరిశ్రమలోని వ్యక్తులు తమ వారసులని సినీ పరిశ్రమలోకి తీసుకువస్తారు. కానీ అతి తక్కువ మంది తమ వారసురాళ్ళని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి పలువురు వారసురాళ్లు సినీ రంగంలో ఉన్నారు.

మోహ‌న్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు ల‌క్ష్మీ ఎప్పుడో సినీ రంగంలోకి అడుగు పెట్టేశారు. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఇక కృష్ణ ఫ్యామిలీ నుంచి మంజుల నటిగా, నిర్మాతగా పరిశ్రమలో ఉన్నారు. మెగాస్టార్ కూతురు సుశ్మిత కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా, నిర్మాతగా బిజీబిజీగా ఉన్నారు. ఇక మరో మెగా డాటర్ నిహారిక కూడా నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ నిర్మాతగా ఉంది. ఇటీవల ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరూ హీరోయిన్స్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళే కాకుండా మరింతమంది మహిళా వారసురాళ్లు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Star Heros : వెండితెరని శాసిస్తూ.. బుల్లితెరని ఏలేస్తున్న స్టార్ హీరోలు..

తాజాగా అదేబాటలో ఇప్పుడు బాలయ్య రెండో కూతురు తేజ‌స్విని కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి వర్క్ చేసింది అని సమాచారం. అలాగే బాలయ్య బాబు డేట్స్ కూడా ఇటీవల తేజస్విని చూసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ టైములో తండ్రితో కలిసి తేజస్విని కనిపించిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. తేజస్విని కూడా త్వరలో నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు తీయబోతుందంటూ టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.