Star Heros : వెండితెరని శాసిస్తూ.. బుల్లితెరని ఏలేస్తున్న స్టార్ హీరోలు..

 సిల్వర్ స్ర్కీన్ పై ఫేవరేట్ స్టార్స్ కనిపిస్తే ఫ్యాన్స్ ఊపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆ క్రేజ్ కోసం మన స్టార్స్ ఎంతో కష్టపడుతుంటారు. సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ అభిమానులకు దగ్గరవ్వడానికి ట్రై చేస్తుంటారు. రీసెంట్ టైమ్స్ లో అందరి అభిమానాన్ని చూరగొనేందుకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యేందుకు పలువురు ఇండియన్ స్టార్స్ బుల్లితెరను కూడా ఏలుతున్నారు........

Star Heros : వెండితెరని శాసిస్తూ.. బుల్లితెరని ఏలేస్తున్న స్టార్ హీరోలు..

Star Heros ruling small screens also

Star Heros :  సిల్వర్ స్ర్కీన్ పై ఫేవరేట్ స్టార్స్ కనిపిస్తే ఫ్యాన్స్ ఊపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆ క్రేజ్ కోసం మన స్టార్స్ ఎంతో కష్టపడుతుంటారు. సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ అభిమానులకు దగ్గరవ్వడానికి ట్రై చేస్తుంటారు. రీసెంట్ టైమ్స్ లో అందరి అభిమానాన్ని చూరగొనేందుకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యేందుకు పలువురు ఇండియన్ స్టార్స్ బుల్లితెరను కూడా ఏలుతున్నారు.

డిజిటల్ ట్రెండ్ మొదలైన దగ్గరనుంచి.. ఎంటర్ టైన్ మెంట్ ఎన్నో రకాలుగా స్ప్రెడ్ అయింది. నిన్నమొన్నటి వరకూ టీవీలకే పరిమితమైన టాక్ షోస్ ఇప్పుడు ఓటీటీలనూ ఆక్యుపై చేసేశాయి. ఇటు రకరకాల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జనం అటు ప్రముఖ స్టార్స్ టాక్ షోస్ నూ విపరీతంగా ఆదిరిస్తున్నారు. అందుకే చాలా మంది స్టార్స్ హోస్టులుగా కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. టీవీ టాక్ షోస్, ఓటీటీ టాక్ షోస్ తో ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు.

సెలబ్రిటీస్ ను మామూలు స్టార్స్ ప్రశ్నలు అడిగితే కిక్కేం ఉంటుంది? అవతలి వ్యక్తి స్థాయికి కాస్త ఎక్కువ స్థాయిలో ఉన్న పర్సనాలిటీ అయితే ఆడియన్స్ కూ మంచి శాటిస్ఫేక్షన్ ఉంటుంది. అందుకే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చైనా సరే తమ షోస్ ను రక్తికట్టించడానికి నిర్వహకులు స్టార్ హీరోల్ని హోస్టులుగా దింపేస్తున్నారు. రాబోయే కాలాన్ని శాసించేవి డిజిటల్ ప్లాట్ ఫామ్సే అనే సత్యాన్ని గ్రహించిన మన స్టార్స్ టాక్ షోలతో మెప్పించడానికి రెడీ అయిపోతున్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ వెండితెరపై డైలాగ్స్ మెషీన్. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్ధుల్ని గడగడలాడించే ఆయన బుల్లితెరపై కూడా తన వాడి, వేడి ప్రశ్నలతో సెలబ్రిటీస్ నూ కంగారు పెట్టేస్తారు. అసలు ఆయన హోస్టింగే అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్ మెంట్. ఒక్కసారి కూడా బుల్లితెరపై కనిపించని నందమూరి బాలకృష్ణ మొదటిసారి ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల్ని తన స్టైల్లో ప్రశ్నలు అడుగుతుతూ బాలయ్య హోస్ట్ గా అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు తన మార్కు మేనరిజమ్స్ తో, డైలాగులతో షోను రక్తికట్టిస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న అన్ స్టాపబుల్ షో ఇప్పుడు రెండో సీజన్లోకి ఎంటరైంది. రెండు సీజన్లలోనూ ఎంతో మంది స్టార్ హీరోలు, డైరెక్టర్స్ తో రచ్చ చేశారు.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ క్విజ్ షో ద్వారా హోస్ట్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున ఆ తర్వాత నాలుగు సీజన్స్ నుంచి తెలుగు బిగ్ బాస్ షోను తన అద్భుతమైన హోస్టింగ్ తో రక్తికట్టిస్తున్నారు. ఈ వయసులోనూ ఫ్యాషనబుల్ డ్రెసెస్ ధరించడంలో ఆయన్ను కొట్టేవారే లేరు. కుర్రాళ్ళతో కుర్రాడిగా మారిపోయి అల్లరి చేస్తూ ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇంతకు ముందు యన్టీఆర్, నాని హోస్టింగ్ తో మెప్పించినప్పటికీ నాగ్ హోస్టింగ్ కు వీక్షకులు ఎంతగానో అలవాటు పడిపోయారు.

లోకనాయకుడు కమల్ హాసన్ యాక్టింగ్ టాలెంట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడాయన హోస్టింగ్ టాలెంట్ తెలియాలంటే తమిళ బిగ్ బాస్ చూసేయాల్సిందే. మన బిగ్ బాస్ లాగానే తమిళ బిగ్ బాస్ కూడా ఇప్పటికి ఐదు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అక్కడ మనకన్నా కాస్తంత లేట్ గా బిగ్ బాస్ ఆరో సీజన్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకూ జరిగిన, ఇప్పుడు జరుగుతోన్న సీజన్స్ అన్నిటికీ కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన స్ర్కీన్ ప్రెజెన్స్ తో అంటు కంటెస్టెంట్స్ ను ఇటు ఆడియన్స్ ను కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కమల్.

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఇటు మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే అటు బుల్లి తెరపై బిగ్ బాస్ హోస్ట్ గానూ తనదైన టాలెంట్ చూపిస్తున్నారు. ఎంతో కాలంగా తన యాక్టింగ్ వెర్సటాలిటీతో మలయాళీలను అమితంగా ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయారు.

స్మాల్ స్క్రీన్స్ పై స్టార్స్ హోస్టులుగా చెలరేగే సాంప్రదాయం బాలీవుడ్ నుంచే మొదలైంది. ఎంతటి పెద్ద స్టార్ అయినప్పటికీ ఆడియన్స్ ను టాక్ షోస్ తోనూ ఎంటర్టైన్ చేయొచ్చని చాలా మంది స్టార్స్ ప్రూవ్ చేశారు. కొందరు ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఏజ్ ఇప్పుడు ఎయిటీ. అయినప్పటికీ ఆయన ఎనర్జీతో ఎవరూ పోటీ పడలేరు. ఒక పక్క వరుస సినిమాలు, మరో పక్క యాడ్స్, ఇంకో పక్క కేబీసీ క్విజ్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. ఆయన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్ పతి క్విజ్ షో ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ అమితాబ్ స్థాయిలో వేరెవరూ హోస్టింగ్ చేయలేకపోవడం ఆయన సాధించిన ఘనత.

హిందీ ప్రేక్షకులకు సినిమాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా కిక్కిచ్చే మరో రియాలిటీ షో బిగ్ బాస్. దాదాపు పదహారేళ్ళుగా హైయస్ట్ టీఆర్పీ రేట్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది బిగ్ బాస్. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్ట్ అన్న సంగతి తెలిసిందే. అర్షద్ వార్సి, శిల్పాశెట్టి, అమితాబ్ బచ్చన్ లాంటి హోస్ట్స్ తో బిగ్ బాస్ బిగినింగ్లో సందడి చేసినప్పటికీ గత ఎనిమిది సీజన్స్ పాటు సల్మాన్ ఖానే దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తుండడం విశేషం. కొత్త సీజన్ ఈ నెల్లోనే ప్రారంభమైంది. వివాదాల పరంగానూ హిందీ బిగ్ బాస్ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఏ హోస్ట్ కూ రానంత పేరు సల్మాన్ ఖాన్ కు బిగ్ బాస్ షోతో వచ్చింది.

Nikesha Patel: “నీ వెంట నేను నడుస్తా”…పవన్ ట్వీట్ కి కొమరం పులి హీరోయిన్ రీ ట్వీట్..

బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ పద్దెనిమిదేళ్ళుగా హోస్ట్ గా చేస్తున్న సూపర్ హిట్ టాక్ షో కాఫీ విత్ కరణ్. కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే ఈ షోలో సందడి చేస్తారు. ప్రస్తుతం ఈ టాక్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను షేక్ చేస్తోంది. సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలతో పాటు బెడ్ రూమ్ కహానీలు కూడా కాఫీ విత్ కరణ్ షో స్పెషాలిటీ. అందుకే ఈ షో చూడ్డానికి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో కాఫీ విత్ కరణ్ షో కొత్త టర్న్ తీసుకుంది. ఓన్లీ బాలీవుడ్ జనంతోనే కాకుండా సమంత, విజయ్ దేవరకొండ లాంటి సౌత్ స్టార్స్ ను కూడా కొంటె ప్రశ్నలడిగి వారి పర్సనల్స్ ని కూడా రివీల్ చేయించాడు కరణ్ జోహార్. దాంతో ఈ షోకి సౌత్ లో కూడా మంచి పేరొచ్చింది.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హోస్ట్ గా అదరగొడుతున్న గేమ్ షో ది బిగ్ పిక్చర్. పేరుకు తగ్గట్టుగానే ఈ షో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో ముందుంటోంది. అతి తక్కువ టైమ్ లో బాలీవుడ్ లో స్టార్ హీరో అయిపోయాడు రణవీర్. ఇప్పుడు ఈ హీరో ఏకంగా ఓ గేమ్ షోని హోస్ట్ గా చేస్తూ బుల్లితెర జనానికి కూడా దగ్గరైపోయాడు. ది బిగ్ పిక్చర్ అనే గేమ్ షోతో రణవీర్ నార్త్ జనానికి మంచి టైమ్ పాస్ గా మారాడు.

బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ సైతం ఓ కోర్ట్ కామెడీ సిరీస్ తో బాగా ఫేమస్ అయ్యాడు. సిరీస్ పేరు కేస్ తో బంతాహై. ఇందులో రితీష్ కామెడీ లాయర్ గా అలరిస్తున్నాడు. గేమ్ షోస్ లో అయినా, రియాలిటీ షోస్ లో అయినా ప్రయోగాలు చేయడం బాలీవుడ్ కే చెల్లింది. రితీశ్ దేశ్ ముఖ్ హోస్టింగ్ తో మొట్టమొదటి కోర్ట్ కామెడీ సిరీస్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో రితీష్ తో పాటు పలువురు బాలీవుడ్ సోషల్ మీడియా పాపులర్ అయినా వ్యక్తులు కూడా నటించారు.

Baba Ramdev : సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్..

ఇక మన తెలుగులో కొంతమంది స్టార్స్ ఇప్పటికే టీవీ షోలలో జడ్జీలుగా, గెస్టులుగా వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్స్ అందరూ వెండితెర మీదే కాదు బుల్లి తెరమీద కూడా తాము స్టార్సే అని నిరూపిస్తున్నారు. మరి ఇంకెంతమంది స్టార్లు బుల్లితెరను ఏలతారో చూడాలి.