Baba Ramdev : సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్..

బాబా రాందేవ్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో బాబా రాందేవ్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ తీసుకుంటాడో లేదో నాకైతే తెలీదు. ఇక షారుఖ్ కొడుకు...........

Baba Ramdev : సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్..

Baba Ramdev :  బాలీవుడ్ సెలబ్రిటీలు పార్టీలు, డ్రగ్స్ అంటూ తిరుగుతారని అందరికి తెలిసిందే. కానీ ఎవరూ దీని గురించి ఎక్కువగా మాట్లాడరు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం మరోసారి బయటపడి సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం షారుఖ్ తనయుడు డ్రగ్స్ వాడాడు అంటూ అరెస్ట్ చేయడం బాలీవుడ్ కి పెద్ద షాక్ తగిలింది. నేటికీ కొంతమంది బాలీవుడ్ వ్యక్తులపై డ్రగ్స్ కేసులు కొనసాగుతున్నాయి.

Manava Arun Naik : రాత్రిపూట బాలీవుడ్ నటికి క్యాబ్ డ్రైవర్ తో చేదు అనుభవం.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి..

ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో బాబా రాందేవ్ మాట్లాడుతూ.. ”బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ తీసుకుంటాడో లేదో నాకైతే తెలీదు. ఇక షారుఖ్ కొడుకు డ్రగ్స్ తీసుకొని జైలుకి వెళ్ళొచ్చాడు. బాలీవుడ్ హీరోయిన్స్ గురించి దేవుడికే తెలియాలి. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ గుప్పిట్లో ఉంది. సినిమా పరిశ్రమతో పాటు రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వాడకం మొదలయింది. ఎన్నికల్లో మద్యం పంపిణి విపరీతంగా జరుగుతుంది. భారతదేశాన్ని డ్రగ్ అడిక్షన్ నుంచి విముక్తి చేయాలి. అందుకు మేము ఉద్యమం చేస్తాం” అని అన్నారు. దీంతో బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.