Balakrishna : సీఎం అయిన బావ.. ఆత్మీయంగా చెల్లెలి నుదిటిపై ముద్దాడిన బాలయ్య బాబు..
చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజిపై కూర్చున్న అనంతరం బాలకృష్ణ వచ్చి చెల్లెలిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లెలి నుదిటిపై ముద్దు పెట్టాడు.

Balakrishna Shows his love Towards his Sister Nara Bhuvaneswari
Balakrishna : నేడు ఏపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మిగిలిన మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే కార్యక్రమానికి ముందే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
నందమూరి ఆడపడుచులు పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి స్టేజిపైకి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజిపై కూర్చున్న అనంతరం బాలకృష్ణ వచ్చి చెల్లెలిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లెలి నుదిటిపై ముద్దు పెట్టాడు. నారా భువనేశ్వరి కూడా ఆప్యాయంగా అన్నయ్యను హత్తుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బావ చంద్రబాబు నాలుగోసారి సీఎం అవ్వడంతో ఇలా బాలకృష్ణ చెల్లెలి వద్దకు వెళ్లి తన ప్రేమని చూపించాడు, సంతోషాన్ని చెల్లితో పంచుకున్నాడు, చెల్లెలు అంటే ఎంత ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బాలయ్య బాబు ఈసారి తన ప్రేమ పలరింపుతో వైరల్ అవుతున్నాడు.