Balakrishna: మార్చి 11న బాలయ్య ‘సింహా’ గర్జన.. మామూలుగా ఉండదట!
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన రోల్స్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు బాలయ్య.

Balakrishna Simha Movie Re-Release On March 11
Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన రోల్స్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు బాలయ్య.
Balakrishna : మరో యాడ్‌తో బాలయ్య.. ధగధగ మెరిసిపోతున్నాడుగా..
అయితే ఈ సినిమా వచ్చే వరకు సమయం పడుతుండటంతో అభిమానులు బాలయ్య సినిమా నుండి ఏదైనా అప్డేట్స్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మార్చి 11న బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలయ్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సింహా’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
Balakrishna: బాలయ్య సరసన మరోసారి ప్రగ్యా జైస్వాల్.. దేనికో తెలుసా..?
ఇక బాలయ్య ఈ సినిమాలో చేసిన యాక్షన్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇప్పుడు ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ చేస్తుండటంతో ‘సింహా’ గర్జన చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించగా, స్నేహ ఉల్లాల్, నయనతార, నమితలు హీరోయిన్లుగా నటించారు. మరి సింహా చిత్రానికి ప్రేక్షకులు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.