Balayya – Sreeleela : బాలయ్యతో శ్రీలీల కిస్సిక్ స్టెప్పులు.. అన్‌స్టాపబుల్ లో శ్రీలీల ట్యాలెంట్స్ అన్ని చూపించేసినట్టు ఉందిగా..

తాజాగా ఆహా టీమ్ షో నుంచి శ్రీలీల ఫోటోలు కొన్ని షేర్ చేసింది.

Balakrishna Sreeleela Funny Photos Shares from Aha Unstoppable Shoot

Balayya – Sreeleela : ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా శ్రీలీల, నవీన్ పోలిశెట్టి బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు. ఈ ఇద్దరూ మంచి ఎనర్జీ ఉన్న స్టార్స్ కావడం వీరికి బాలయ్య తోడవడంతో ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read : Game Changer Song : గేమ్ ఛేంజర్ నుంచి కొత్త సాంగ్ పోస్టర్ రిలీజ్.. మెలోడీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే పలు వీడియోలు, కొన్ని ఫోటోలు బయటకు రాగా తాజాగా ఆహా టీమ్ షో నుంచి శ్రీలీల ఫోటోలు కొన్ని షేర్ చేసింది. ఇందులో బాలకృష్ణతో కలిసి శ్రీలీల పుష్ప 2 సాంగ్ కిస్సిక్.. కు స్టెప్పులు వేసినట్టు ఉంది. అలాగే వీణ వాయిస్తున్న ఫోటో ఉంది, మరో ఫొటోలో శ్రీలీల డ్యాన్స్ చేస్తుంది. దీంతో శ్రీలీల ఈ షోలో తనకు వచ్చిన అన్ని ట్యాలెంట్స్ చూపించేసిందా ఏంటి అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

శ్రీలీల మంచి డ్యాన్సర్ అని తెలిసిందే. డ్యాన్స్ తో పాటు అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీల ఇంకెన్ని ట్యాలెంట్స్ చూపించిందో అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఆహా రిలీజ్ చేసిన శ్రీలీల ఫోటోలు వైరల్ గా మారాయి.