Balakrishna: “జెట్టి” సినిమా కథ విని బాలకృష్ణ నటించాలనుకున్నారు..

వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం "జెట్టి". ఈ సినిమా ట్రైలర్ ని సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..

Balakrishna: “జెట్టి” సినిమా కథ విని బాలకృష్ణ నటించాలనుకున్నారు..

Balakrishna wanted to act after hearing the story of Jetty

Updated On : November 3, 2022 / 7:54 PM IST

Balakrishna: వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం “జెట్టి”. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4వ రిలీజ్ కానుంది. జెట్టి మూవీ ట్రైలర్ ని సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్ చేశాడు.

Balakrishna : అందరికి బాలయ్యే కావాలి.. ఎక్కడ చూసినా బాలయ్య బాబు హవా నడుస్తుంది..

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. “జెట్టి ట్రైలర్ లోని కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశాడు.

కాగా ఇటీవల ఈ సినిమా కథని విన్న నందమూరి బాలకృష్ణ.. కొన్ని మార్పులు చేసి ఉంటే ఈ మూవీలో నేనే నటించేవాడిని అంటూ వ్యాఖ్యానించినట్లు జెట్టి మూవీ దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక వెల్లడించాడు. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీరసింహారెడ్డి” సినిమాని తెరకెక్కిస్తున్నాడు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.