’ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాన్ని థియేటర్ లో చూసిన బాలకృష్ణ  

హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబిక థియేటర్ వద్ద బాలకృష్ణ సందడి చేశాడు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 03:09 AM IST
’ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాన్ని థియేటర్ లో చూసిన బాలకృష్ణ  

హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబిక థియేటర్ వద్ద బాలకృష్ణ సందడి చేశాడు.

హైదరాబాద్ : ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 బుధవారం విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో బెన్ ఫిట్ షోలను ప్రదర్శించారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబిక థియేటర్ వద్ద బాలకృష్ణ సందడి చేశాడు. చిత్ర యూనిట్ సినిమాను వీక్షించారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్, విద్యా బాలన్, కళ్యాణ్ రామ్ లు సినిమా చూశారు.

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్ బీకే ఫిల్మ్స్ వారాహి చలన చిత్రం విబ్రిమీడియా బ్యానర్స్ పై బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణుఇంటూరి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి కంచె, గౌతమీపుత్రశాతకర్ణి సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.