Bandla Ganesh: నటుడి నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ తన కెరీర్‌లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్‌సింగ్ వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సైతం అందుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అయితే ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాలను చేయడం లేదు. దీంతో ఆయన అభిమానులు, నిర్మాతగా బండ్ల గణేష్ సినిమాలు ఎందుకు చేయడం లేదా అని ఆరా తీస్తున్నారు.
Bandla Ganesh: నా ప్రాణం పోయినా అలా చేయను.. చంద్రబాబు, విజయసాయి ఫొటోపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్..
కాగా, ఈ ప్రొడ్యూసర్ మాత్రం సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడని.. అందుకే సినిమాను ప్రొడ్యూస్ చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బిజీగా ఉండటం.. మరికొంత కాలం వరకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బండ్ల గణేష్ సినిమా చేయడానికి వీలు పడటం లేదట. అయితే ఇటీవల ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మాస్ రాజా రవితేజతో త్వరలోనే బండ్ల గణేష్ ఓ సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాతగా తన తొలి సినిమాను చేసిన హీరోతో మళ్లీ సినిమా చేయడానికి మంచి కథ కోసం చూస్తున్నాడట బండ్ల గణేష్.
Bandla Ganesh : బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ ఇచ్చాడా?
ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాస్ రాజాతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమా కథ రవితేజకు నచ్చితే, త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే బండ్ల గణేష్ నిర్మాతగా మరోసారి మాస్ రాజా రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడా.. ఈ సినిమాను నిజంగానే గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నాడా.. అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.