Bandla Ganesh : అవును త్రివిక్రమ్ ని తిట్టింది నేనే.. అయితే ఏంటి?? బండ్లన్న అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ దీనిపై స్పందించాడు. యాంకర్ వైరల్ గా మారిన ఆ ఆడియో కాల్ గురించి అడగగా బండ్లన్న మాట్లాడుతూ.. అవును త్రివిక్రమ్ ని తిట్టింది నేనే............

Bandla Ganesh : అవును త్రివిక్రమ్ ని తిట్టింది నేనే.. అయితే ఏంటి?? బండ్లన్న అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Bandla Ganesh gives clarity on leaked audio call about trivikram

Bandla Ganesh :  నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ మంచి పేరు తెచ్చుకున్నా, పవన్ సినిమా ఈవెంట్స్ లో పవన్ ని పొగుడుతూ తన స్పీచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా బండ్ల గణేష్ స్పీచ్ ల కోసం ఎదురు చూస్తుంటారు. పవన్ సినిమా వచ్చిందంటే కచ్చితంగా బండ్ల గణేష్ ఉంటాడు. అయితే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ రాకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ వాయిస్ తో ఒక రికార్డెడ్ కాల్ ఆడియో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో త్రివిక్రమ్ ని తిడతాడు బండ్ల గణేష్. భీమ్లా నాయక్ ఫంక్షన్ కి రాకుండా త్రివిక్రమ్ నన్ను అడ్డుకుంటున్నాడని, వాడు, వీడు అంటూ రెచ్చిపోయి త్రివిక్రమ్ ని తిట్టాడు ఆ కాల్ లో. దీంతో ఆ ఆడియో వైరల్ గా మారింది. ఆ సమయంలో దీనిపై త్రివిక్రమ్ మాత్రం స్పందించలేదు. కానీ బండ్ల గణేష్ దీనిపై స్పందిస్తూ ఆ వాయిస్ నాది కాదు అని అన్నాడు.

Rashmika Mandanna : నా స్వయంవరంలో ఆ ముగ్గురూ ఉండాలి.. విజయ్ దేవరకొండని పక్కనపెట్టేసిందేంటి??

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ దీనిపై స్పందించాడు. యాంకర్ వైరల్ గా మారిన ఆ ఆడియో కాల్ గురించి అడగగా బండ్లన్న మాట్లాడుతూ.. అవును త్రివిక్రమ్ ని తిట్టింది నేనే. ఆ వాయిస్ నాదే. అయితే ఏంటి? మనిషన్నాక కోపం రాదా?కోపం వచ్చి తిట్ఠమా? అలాగే తిట్టాను, తర్వాత మళ్ళీ సారీ చెప్పాను” అని అన్నాడు. అప్పుడేమో ఆ వాయిస్ నాది కాదు అని, ఇప్పుడేమో నేనే తిట్టాను అని చెప్పడంతో మరోసారి బండ్లన్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.