మెగాస్టార్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా 13ఏళ్ల బాలుడు
మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ 'బారోజ్'.

మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ ‘బారోజ్’.
మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ ‘బారోజ్’. ఈ మూవీకి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పదమూడేళ్ల పిల్లాడిని పరిచయం చేయబోతున్నారు.
ఆ పిల్లాడు ఎవరో కాదు.. తమిళ సంగీత దర్శకుడు సతీష్ కుమారుడే. పిల్లాడి పేరు లైడియన్ నాదస్వరం. ఇటీవలే లైడియన్ అమెరికా టాలెంట్ షో ‘ద వరల్డ్స్ బెస్ట్’లో విజేతగా నిలిచాడు. లైడియన్ రెండేళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు.
ఓ షోలో లైడియన్ నిమిషంలో 325 బీట్స్ ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా వరకు గోవాలో జరగనుంది. మలయాళ పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి.