Baby John : బేబీ జాన్ రిలీజ్ కి ముందు.. మహాకాళేశ్వరలో ప్రత్యేక పూజలు చేసిన టీమ్..

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా బేబీ జాన్.

Baby John : బేబీ జాన్ రిలీజ్ కి ముందు.. మహాకాళేశ్వరలో ప్రత్యేక పూజలు చేసిన టీమ్..

Updated On : December 24, 2024 / 5:50 PM IST

Baby John : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా బేబీ జాన్. ఈ సినిమాతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుండుంది. ఇప్పటికే టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈమె మరి బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందా చూడాలి.

అయితే కీర్తి సురేష్ ఈ నెల 12న వివాహబంధం లోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహమాడింది ఈమె. అలా పెళ్లి చేసుకుందో లేదో ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది కీర్తి. కాగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్.

Also Read : Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో..మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో మూవీ టీమ్.. నటులు వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి తమ చిత్రం బేబీ జాన్ విడుదలకు ముందు ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్టార్ కాస్ట్‌తో పాటు నిర్మాతలు అట్లీ, ప్రియా అట్లీ కూడా ఆలయంలో కనిపించారు. అందరూ కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.