Bellamkonda Ganesh : ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఢీ కొడతా అంటున్న బెల్లంకొండ డెబ్యూ హీరో

దసరా పండుగని మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున టార్గెట్ చేశారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా రోజు అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు నాగార్జున ఘోస్ట్ సినిమా కూడా........

Bellamkonda Ganesh : ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఢీ కొడతా అంటున్న బెల్లంకొండ డెబ్యూ హీరో

Bellamkonda Ganesh ready to release his debut movie swathimutyam on Dasara Festival

Updated On : September 18, 2022 / 12:16 PM IST

Bellamkonda Ganesh : టాలీవుడ్ లో పెద్ద పండగలకి స్టార్ హీరోలంతా తమ సినిమాలతో రెడీగా ఉంటారు. త్వరలో దసరా పండుగా రానుంది. ఇప్పటికే దసరా పండుగని మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున టార్గెట్ చేశారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా రోజు అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు నాగార్జున ఘోస్ట్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఈ సారి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల మధ్య రసవత్తరమైన పోటీ ఉండబోతుందని అర్ధమవుతుంది.

అయితే తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల మధ్యలో డెబ్యూ హీరో తన సినిమాతో రాబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పుడు దసరా రోజు అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.

Dulquer Salmaan : సీతారామం సీక్వెల్ ఉండదు.. నేను సీక్వెల్స్, రీమేక్స్ చేయను..

ఓ పక్క ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు, పండగ, అసలు థియేటర్స్ దొరుకుతాయో లేవో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఒక డెబ్యూ హీరో సాహసం చేసి సినిమా రిలీజ్ చేయడం అవసరమా అని పలువురు టాలీవుడ్ వర్గీయులు భావిస్తున్నారు. అది కూడా చిన్న సినిమాగా రాబోతుంది. మరి ఏ ధైర్యంతో గణేష్ తన డెబ్యూ మూవీని ఇద్దరు స్టార్ హీరోలకి పోటీగా రిలీజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కష్టమే అని అంటున్నారు. గణేష్ తన డెబ్యూ సినిమా స్వాతిముత్యంని వాయిదా వేసుకుంటాడా లేక పోటీగా దిగుతాడా చూడాలి మరి.