ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత

  • Published By: vamsi ,Published On : February 18, 2020 / 04:26 AM IST
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత

Updated On : February 18, 2020 / 4:26 AM IST

ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్(61) గుండెపోటుతో మరణించారు. తపస్ పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబైకి వెళ్లగా, కోల్‌కతాకు తిరిగి వచ్చే సమయంలో విమానాశ్రయంలో అతనికి గుండెనొప్పి రావడంతో జుహులోని ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తపస్ పాల్ మరణించాడు. 

అతను కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.తపస్‌పాల్‌ పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్‌ కాలేజీలో బయోసైన్స్‌ చదివారు. సినిమాల మీద మక్కువతో 1980లో దర్శకుడు తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్‌ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. తపస్ పాల్ బయో సైన్స్‌లో హూగ్లీ మొహ్సిన్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

తపస్ పాల్ 1984 లో అబోద్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మాధురి దీక్షిత్ సరసన నటించారు. హిరెన్ నాగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మూడు దశాబ్దాలుగా తన కెరీర్‌లో, తపస్ పాల్ ప్రోసెంజిత్ ఛటర్జీ, సౌమిత్రా ఛటర్జీ, రాఖీతో పాటు మౌసుమి ఛటర్జీతో సహా నటులతో కలిసి పనిచేశారు. తపస్ పాల్ చివరిసారిగా 2013లో ఖిలాడి సినిమాలో కనిపించారు. ఆయనకు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు.