Bhagavanth Kesari : భగవంత్ కేసరి హంగామా ఇంకా అవ్వలేదు.. మళ్లీ సక్సెస్ సెలెబ్రేషన్స్..

ఇప్పటికే భగవంత్ కేసరి సక్సెస్ ప్రెస్ మీట్స్, సెలబ్రేషన్స్, టూర్స్ చేశారు. దసరాకి సినిమా రిలీజయి మూడు వారాలు అయి త్వరలో దీపావళి సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిరవహించబోతున్నారు చిత్రయూనిట్.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి హంగామా ఇంకా అవ్వలేదు.. మళ్లీ సక్సెస్ సెలెబ్రేషన్స్..

Bhagavanth Kesari Box Office Ka Sher Celebrations by Movie Unit

Updated On : November 7, 2023 / 1:23 PM IST

Bhagavanth Kesari : డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇన్నాళ్లు తనకు సక్సెస్ ఇచ్చిన కామెడీ జోనర్ ని కొంచెం పక్కనపెట్టి ఈసారి బాలకృష్ణతో(Balakrishna) ఎమోషనల్, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘భగవంత్ కేసరి’తో వచ్చి భారీ హిట్ సాధించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీలీల(Sreeleela), అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఇటీవల దసరాకు వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మహిళా శక్తి గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్.. లాంటి మెసేజ్ లను బాలకృష్ణతో చెప్పించి అనిల్ సక్సెస్ అయ్యారు. భగవంత్ కేసరి సినిమా మొదటి రోజే 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆరు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. భగవంత్ కేసరి సినిమాతో వరుసగా మూడో సారి 100 కోట్లు కొట్టి హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. మొత్తంగా ఇప్పటివరకు భగవంత్ కేసరి సినిమా 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.

Also Read : Yatra 2 Movie : ‘యాత్ర 2’ సినిమాలో సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఇప్పటికే భగవంత్ కేసరి సక్సెస్ ప్రెస్ మీట్స్, సెలబ్రేషన్స్, టూర్స్ చేశారు. దసరాకి సినిమా రిలీజయి మూడు వారాలు అయి త్వరలో దీపావళి సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిరవహించబోతున్నారు చిత్రయూనిట్. బాక్స్ ఆఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ అంటూ ఈ వేడుకని నవంబర్ 9 సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా అభిమానుల మధ్య సెలబ్రేట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కి నందమూరి అభిమానులు భారీగా రానున్నట్టు సమాచారం. ఇక చిత్రయూనిట్ అంతా భగవంత్ కేసరి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొననుంది.