Bhagyashri Borse : మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి వ‌చ్చేసింది.. ఎవ‌రో తెలుసా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప‌క్క‌న ఎవ‌రు న‌టించ‌నున్నారు అనే విష‌యం తెలిసిపోయింది.

Bhagyashri Borse : మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి వ‌చ్చేసింది.. ఎవ‌రో తెలుసా..?

Bhagyashri Borse

Updated On : December 16, 2023 / 6:50 PM IST

Animal Fame Tripti Dimri : మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో షాక్‌, మిర‌ప‌కాయ్ సినిమాలు వ‌చ్చాయి. దీంతో కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ మూవీని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ప‌క్క‌న ఎవ‌రు న‌టించ‌నున్నారు అనే విష‌యం తెలిసిపోయింది.

`యారియాన్ 2 ఫేమ్ `భాగ్యశ్రీ బోర్సే’ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించనుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది. మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి అంటూ చిత్ర‌బృందం హీరోయిన్ ఫోటోను పంచుకుంది. ఇంకా ఈ చిత్రంలో ఎవ‌రెవ‌రు న‌టించ‌నున్నారు అనే విష‌యాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే మిగతా ఆరిస్టుల వివ‌రాల‌ను వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Suma Kanakala : ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాకవుతారు

కాగా.. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయ‌లేదు. హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’కి చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్.. దూరమే తీరమై..

 

View this post on Instagram

 

A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)