Bharadwaja Thammareddy: అది 100% తప్పే..! ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యల వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ హాట్ కామెంట్స్
బాలీవుడ్లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. రెహ్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
- రెహమాన్ గత పదేళ్లలో ఏ సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చాడు?
- ఒక్క సక్సెస్ ఫుల్ సాంగ్ కూడా లేదు
- అందుకనే అవకాశాలు తగ్గుతున్నాయి
Bharadwaja Thammareddy: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు దేశంలో పెను దుమారమే రేపాయి. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్లో తనకు పెద్దగా పని దొరకడం లేదని, బహుశా దీనికి మతపరమైన కారణాలు ఉండొచ్చని రెహమాన్ అన్నారు. సృజనాత్మకత లేని వారి చేతిలో హిందీ పరిశ్రమ ఉందని సంచలన కామెంట్ చేశారు. బాలీవుడ్లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. రెహ్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దేశవ్యాప్తంగా రెహమాన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
తాజాగా ఇదే అంశంపై 10టీవీ పాడ్ కాస్ట్ లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గేందుకు మతపరమైన కారణం కావొచ్చు అని రెహమాన్ అనటం ముమ్మాటికే తప్పు అని తమ్మారెడ్డి అన్నారు. అలా 100 పర్సెంట్ తప్పు అని చెప్పారు. అసలు ఆ ప్రశ్న అడగటమే తప్పు అని అన్నారు. రెహమాన్ ను ఆ ప్రశ్న ఎందుకు అడిగారో తనకు అర్థం కావడం లేదన్నారు.
”రెహమాన్ గత పదేళ్లలో ఏ సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చాడు? ఒక్క సక్సెస్ ఫుల్ సాంగ్ కూడా లేదు. అందుకనే అవకాశాలు తగ్గుతున్నాయి. చాలా ఎక్కువ పారితోషికం ఇచ్చి సక్సెస్ ఫుల్ సినిమా లేకపోతే అవకాశాలు ఎవరు ఇస్తారు? రెహమాన్ లాంటోళ్లు ఆ మాట అనకూడదు. ఎవరన్నా పర్లేదు కానీ ఆ స్థాయి వ్యక్తి అనటం చాలా బాధకరం. కచ్చితంగా ఖండించాల్సిన విషయం” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
Also Read: హీరోయిన్లు, అమ్మాయిల పొట్టి బట్టల వివాదంపై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్
