భారతీయుడు 2 – ‘సేనాపతి’గా కమల్ లుక్ లీక్

విశ్వనటుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ నుంచి కమల్ హాసన్ లుక్ లీక్..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 08:22 AM IST
భారతీయుడు 2 – ‘సేనాపతి’గా కమల్ లుక్ లీక్

విశ్వనటుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ నుంచి కమల్ హాసన్ లుక్ లీక్..

విశ్వనటుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (ఇండియన్ 2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియ భవానీ శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీలో కమల్ 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నారు.

రీసెంట్‌గా షూటింగ్ స్పాట్ నుండి కమల్ లుక్ బయటకొచ్చింది. లొకేషన్‌లో కమల్‌ మేకప్‌ వేసుకుంటుండగా తీసిన ఫోటో లీక్ అయింది.. క్షణాల్లో సోషల్ మీడియాలో కమల్ పిక్ వైరల్ అయిపోయింది.. సేనాపతిగా కంప్లీట్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న కమల్‌ మరోసారి తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా.. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read Also : ఆసక్తికరంగా ‘కమాండో 3’ ట్రైలర్

‘భారతీయుడు’లో కృష్ణస్వామిగా కనిపించిన నెడుముడి వేణుతో పాటు, వివేక్, బాబీ సింహా, వెన్నెల కిషోర్, ఆర్‌జే బాలాజీ, విద్యుత్ జమాల్, ఢిల్లీ గణేష్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.