Bheemla Nayak: సింగిల్ గా దూసుకొస్తున్న భీమ్లా.. తుఫాన్ తప్పదా?!

ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనుకుంటున్నారు కొందరు టాలీవుడ్ మేకర్స్. ప్రెజెంట్ పవన్ మేనియా..

Bheemla Nayak: సింగిల్ గా దూసుకొస్తున్న భీమ్లా.. తుఫాన్ తప్పదా?!

Bheemla Nayak

Updated On : February 20, 2022 / 8:23 AM IST

Bheemla Nayak: ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనుకుంటున్నారు కొందరు టాలీవుడ్ మేకర్స్. ప్రెజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ ను కమ్మేయడంతో ఫిబ్రవరి 25నుంచి ఒక్కొక్కరుగా సైడ్ అవుతున్నారు. అటు సింగిల్ గా సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయాలనుకుంటున్న భీమ్లానాయక్ రిలీజ్ హడావిడీని పీక్స్ కు తీసుకెళ్తున్నారు.

Arabic Kuthu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్!

భీమ్లానాయక్ తో క్లాష్ లేకుండా వాయిదాకు రెడీఅయింది ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల – శర్వా – రష్మిక కాంబోతో హిట్ గ్యారంటీ అనే నమ్మకాన్ని ఇన్ని రోజులు చూపించారు కానీ ఫిబ్రవరి 25న వచ్చేందుకు ఇప్పుడు వెనుకడగు వేసారు. మాక్సిమమ్ థియేటర్స్ భీమ్లా నాయక్ ను బుక్ చేసుకోవడం, పవన్ మేనియా తెలుగు రాష్ట్రాలతో పాటూ యూఎస్ మార్కెట్ లోనూ హైగా కనిపిస్తుండటంతో ఆడవాళ్లు టీమ్ కొత్త డేట్ వెతుక్కుంది. అందుకే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి మార్చ్ 4న సినిమాను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

bheemla Nayak Trailer: ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 22నే భీమ్లా ట్రైలర్!

ఫిబ్రవరి 25న వచ్చేయడం పక్కా అని బాబాయ్ తేల్చేయగానే అబ్బాయ్ వరుణ్ తేజ్ ఆగిపోయాడు. రిస్క్ తీసుకోకుండా గనిని మరో డేట్ కు ఫిక్స్ చేస్తున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే ఏప్రిల్ నెలకు గని వచ్చే ఛాన్స్ ఉంది. కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి524 కూడా ఫిబ్రవరి 25కే వస్తామని ప్రకటించింది కానీ సడెన్ గా భీమ్లానాయక్ ట్రాక్ ఎక్కడంతో… డ్రాప్ అవుతున్నట్టు తేల్చేసారు సెబాస్టియన్ మేకర్స్.

Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

పవర్ స్టార్ రారనుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్, శర్వానంద్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకి పెద్ద దెబ్బ తగిలింది. అజిత్ వలిమై, అలియా గంగూబాయ్ కతియావాడి వచ్చేస్తున్నా పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. ఇక సింగిల్ కింగ్ గా దూసుకొస్తున్న భీమ్లా నాయక్ ప్రమోషన్ స్పీడ్ తో హీటెక్కిస్తుంది. ఫిబ్రవరి 21న ట్రైలర్ రిలీజ్ తో పాటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు. అటు రిలీజ్ కి ముందే 107 కోట్లకు పైగా బిజినెస్ చేసి అసలు సిసలైన మాస్ మసాలా బొమ్మను చూపిస్తున్నాడు భీమ్లా నాయక్.