Bheemla Nayak: ఏడాది పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్.. అరుదైన పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ గతేడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాను పవర్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాడు.

Bheemla Nayak: ఏడాది పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్.. అరుదైన పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్!

Bheemla Nayak Completes One Year

Updated On : February 25, 2023 / 7:29 PM IST

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ గతేడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాను పవర్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాడు.

Bheemla Nayak: భీమ్లా నాయక్.. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే దిగుతున్నాడు!

ఇక ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పర్ఫార్మె్న్స్‌కు తోడుగా రానా దగ్గుబాటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కాగా, ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తవడంతో, చిత్ర మేకర్స్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సరికొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశారు. భీమ్లా నాయక్ చిత్రానికి ప్రేక్షకులు అందించిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిదని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడోచ్.. ఇక బాక్సులు బద్దలే!

ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగవంశీ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అరుదైన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.