Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిపింది వీళ్లే..? ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిపిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిపింది వీళ్లే..? ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..

Bhuj police arrest two accused in Salman Khan house firing incident

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఏప్రిల్ 14న ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి సంచలనం సృష్టించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ దాడికి సంబంధించిన సీసీ టీవీ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి సల్మాన్ ఇంటి ఎదురుగా నాలుగు రౌండ్లు తుపాకులతో కాల్పులు జరిపారు..

ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టగా ఇవాళ తెల్లవారుజామున ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులని గుజరాత్ లోని భుజ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరే సల్మాన్ ఇంటి ముందు కాల్పులకు పాల్పడ్డారని గుర్తించారు. తదుపరి విచారణకు ఈ ఇద్దరినీ నేడు ముంబైకి తరలించనున్నారు.

Also Read : Urvashi Rautela : ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన ఊర్వశి రౌటేలా.. ఆ ఫొటో వల్లే..

గతంలో కూడా పలుమార్లు పలువురు గ్యాంగ్ స్టర్స్ నుంచి సల్మాన్ ఖాన్ కి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో సల్మాన్ కి భద్రత కల్పించడమే కాక సల్మాన్ కూడా స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇలా సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరపడంతో మరికొంతమంది పోలీసులని సల్మాన్ ఇంటి ముందు పెట్టారు. అలాగే సల్మాన్ బయటకు వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.