Manchu Manoj – Bhuma Mounika : మంచు లక్ష్మి నాకు మరో అమ్మ.. భూమా మౌనిక!

వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న టాక్ షోకి వచ్చిన మనోజ్ అండ్ మౌనిక ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మౌనిక.. మంచు లక్ష్మి తనకి మరో అమ్మ అని చెప్పుకొచ్చింది.

Manchu Manoj – Bhuma Mounika : మంచు లక్ష్మి నాకు మరో అమ్మ.. భూమా మౌనిక!

Bhuma Mounika said Manchu Lakshmi is her mother

Updated On : April 19, 2023 / 8:07 PM IST

Manchu Manoj – Bhuma Mounika : మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి వార్త.. రెండు తెలుగు రాష్ట్రలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వారిద్దరి పరిచయం ఎప్పటిది? ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు? అనే విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒకరిలో ఎంతో ఆసక్తి నెలకుంది. తాజాగా ఈ విషయాలన్నీ మనోజ్ అండ్ మౌనిక బయట పెట్టారు. పెళ్ళైన తరువాత మొదటిసారి ఈ కొత్త జంట ఒక టీవీ షోలో పాల్గొన్నారు. మనోజ్ మిత్రుడు మరియు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడంతో ఆడియన్స్ కి తెలియని ఎన్నో విషయాలు పంచుకున్నారు.

Manchu Manoj – Bhuma Mounika : ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా.. అంతా సినిమా మాదిరి సీన్స్!

ఈ షోలో వెన్నెల కిషోర్ మౌనికను ప్రశ్నిస్తూ.. “మంచు లక్ష్మితో (Manchu Lakshmi) మీ రేలషన్ ఎలా ఉంటుంది? అని అడిగాడు. దీనికి మౌనిక బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య ఉన్న రేలషన్ ని ఎలా వర్ణించాలో నాకు అర్ధం కావడం లేదు. కానీ ఆ అనుబంధం మాత్రం ఎంతో అందమైంది. మనోజ్ గురించి ఏమన్నా చెప్పాలన్నా నేను ఆమెతోనే చెబుతుంటాను. నాకు సిస్టర్ అండ్ ఫ్రెండ్ గా కాకుండా అమ్మ స్థానంలో ఆమె నిలబడింది. నన్ను ఒక చిన్న పిల్లలా ఆమె ట్రీట్ చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు అన్ని ఆమె” అంటూ చెప్పుకొచ్చింది.

Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!

ఇక దీనికి వెన్నెల కిషోర్ రెస్పాండ్ అవుతూ మనోజ్ అండ్ మౌనిక పెళ్లి సమయంలో జరిగిన ఒక సంభాషణను పంచుకున్నాడు. వెన్నెల కిషోర్.. “నేను మీ మ్యారేజ్ కి వచ్చినప్పుడు లక్ష్మిని కలిశాను. ఆ సమయంలో ఆమెను ఎలా అనిపిస్తుంది? అని అడిగాను. ఆ ప్రశ్నకు లక్ష్మి బదులిస్తూ.. పెద్దరికం వచ్చినట్లు అనిపిస్తుంది. నా చేతులు మీదగా ఒక పెళ్లి జరుగుతుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెబుతూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ అండ్ మౌనిక పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి జరిపించిన విషయం తెలిసిందే.