Bhumika : ఇప్పటికీ సీనియర్ మహిళా ఆర్టిస్టులకు సరైన పాత్రలు ఇవ్వట్లేదు.. వాళ్ళను చూసి నేర్చుకోండి..
మహిళా ఆర్టిస్ట్ లకు ఒక ఏజ్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వస్తున్నాయి. ఇటీవల దీనిపై పలువురు స్పందిస్తున్నారు.

Bhumika comments on senior heroins characters in movies
Bhumika : 50, 60 ఏళ్ళు వచ్చినా మన హీరోలు(Hero) ఇంకా హీరోల పాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం 35, 40 ఏళ్ళు దాటగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మ, అత్త, అక్క పాత్రలోకి షిఫ్ట్ అవుతున్నారు. చాలా తక్కువ మంది హీరోయిన్స్(Heroins) మాత్రమే 40 ఏళ్లలో కూడా మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. మహిళా ఆర్టిస్ట్ లకు ఒక ఏజ్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వస్తున్నాయి. ఇటీవల దీనిపై పలువురు స్పందిస్తున్నారు.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ఆశా పరేఖ్ దీనిపై మాట్లాడుతూ అమితాబ్ కు ఈ ఏజ్ లో కూడా మెయిన్ లీడ్స్ లో కథలు రాస్తారు, కానీ మాకు సీనియర్ నటీమణులకు మాత్రం రాయరు అని ఫైర్ అయింది. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ భూమిక మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో భూమిక సినిమాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తోంది. ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భూమిక మాట్లాడుతూ.. ఇక్కడ హీరోయిన్స్ కి తక్కువ లైఫ్ ఉంటుంది. నటీమణులు కూడా ఏజ్ పెరిగినా లీడ్ రోల్స్ చేయగలరు. కానీ మేకర్స్ మమ్మల్ని అలా చూడలేకపోతున్నారు. హీరోలు ఇప్పటికీ హీరోలుగానే నటిస్తున్నారు. కానీ మహిళా ఆర్టిస్టులు మాత్రం కమర్షియల్ సినిమాల్లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గుర్తింపు లేని పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో సీనియర్ మహిళా ఆర్టిస్టులకు కూడా బలమైన రోల్స్ ఇస్తున్నారు. వాటిని చూసి నేర్చుకోవాలి. ఇప్పటికీ మహిళా నటులు క్యారెక్టర్స్ లో వెనకపడే ఉన్నారు. పరిశ్రమలో మార్పు రావాలి. మనం సీనియర్ నటీమణులను మెయిన్ లీడ్స్, బలమైన పాత్రలు పెట్టి సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూస్తారు. మనం తీయకుండా ప్రేక్షకులు చూడరు అని ఎలా చెప్తారు అంటూ కామెంట్స్ చేసింది.