అఫీషియల్: ఎవరు హీరో! ఎవరు విలన్?..

  • Published By: sekhar ,Published On : October 16, 2020 / 04:16 PM IST
అఫీషియల్: ఎవరు హీరో! ఎవరు విలన్?..

Updated On : October 16, 2020 / 4:21 PM IST

Vishal – Arya Multistarrer: తమిళ యువ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నేడు (అక్టోబర్ 16) వీరిద్దరూ నటిస్తున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది విశాల్ 30వ చిత్రం అలాగే ఆర్య 32వ చిత్రం కావడం విశేషం.


విక్రమ్ ‘ఇంకొక్కడు’, విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. మిని స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రామోజీ ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశాల్ హీరోగా ఆర్య విలన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. Vishal - Aryaవిశాల్, ఆర్య బాల రూపొందించిన ‘వాడు-వీడు’ సినిమాలో కలిసి నటించారు. విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ‘వరుడు’ చిత్రంలో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న ఆర్య పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వీరిద్దరు కలిసి మరోసారి నటిస్తుండడంతో ఈ సినిమా మీద తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి.

Mini Studio