బిగ్ బాస్ విన్నర్‌కు లైవ్‌లో చెంపదెబ్బ కొట్టిన కంటెస్టెంట్

బిగ్ బాస్ 13తో మోస్ట్ లవ్డ్ పెయిర్ అయిన సిద్ధార్థ్ శుక్లా.. షెహనాజ్ గిల్ మరోసారి కలిసి కనిపించారు. ఇన్‌స్టాగ్రామ లైవ్ సెషన్లో అభిమానులతో మాట్లాడారు. ఈ సెషన్లో చాలా విషయాలపై మాట్లాడారు. అభిమానుల విషయంలో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. సోషల్ మీడియలో ఫ్యాన్ క్లబ్స్ గురించి చర్చిస్తూ వాతావరణం వేడెక్కింది.
ఆ వీడియోలో సిద్ధార్థ్, షెహనాజ్ వారి ఫాలోవర్లు లైవ్ చూస్తున్నారని వారిద్దరూ కలిసి ఫైటింగ్ చేస్తున్నారా మరేమైనా ఆలోచిస్తున్నారా అని వర్రీ కాకుండా ఉండరు. ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో వారిని వదిలేయడమే మంచిది. ఈ సమయంలోనే షెహనాజ్.. సిద్ధార్థ్ ను చెంపదెబ్బ కొట్టింది. నెటిజన్లు ట్రోల్ చేయడానికి మంచి వంక దొరికిందన్నట్లు చెప్పుకుంటున్నారు.
బిగ్ బాస్ 13లోని సిద్ధార్థ్, షెహనాజ్ లకు సీజన్ మొత్తంలో తరచూ లింకులు పెడుతూనే ఉన్నారు. వారిద్దరూ త్వరలో ఒకటైపోతారని అన్నారు. బిగ్ బాస్ సీజన్ సమయంలో సిద్దార్థ్ పైన ఫీలింగ్స్ గురించి షెహనాజ్ చెప్పింది. అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పింది. మరోవైపు సిద్ధార్థ్ ఆమెపై ప్రేమ అనేది కేవలం స్నేహం వరకూ పరిమితం అని అన్నారు.
సిద్దార్థ్ బిగ్ బాస్ 13విన్నర్. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ ఫైనలిస్టుల్లో షెహనాజ్ కూడా ఉంది.