Bigg Boss 7 Day 70 : దీపావళి రోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరు?

ఆదివారం ఎపిసోడ్, దీపావళి ఒకేరోజు రావడంతో హౌస్ మరింత కళకళలాడింది. హౌస్ లోని వారంతా చక్కాగా రెడీ అయ్యారు. నాగార్జున కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 7 Day 70 : దీపావళి రోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరు?

Bigg Boss 7 Day 70 Highlights Elimination from Bigg Boss

Updated On : November 13, 2023 / 7:24 AM IST

Bigg Boss 7 Day 70 : బిగ్‌బాస్ పది వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్, దీపావళి ఒకేరోజు రావడంతో హౌస్ మరింత కళకళలాడింది. హౌస్ లోని వారంతా చక్కాగా రెడీ అయ్యారు. నాగార్జున కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. దీపావళి కావడంతో ఫైండ్ ది క్రాకర్ అని ఓ గేమ్ పెట్టారు నాగార్జున. జోడీలుగా ఆడగా ఈ గేమ్ లో ప్రియాంక – అమర్ దీప్ జోడి గెలిచింది.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ని స్టేజిపైకి పిలిచారు. ఒక్కొక్కరు వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. సలహాలు ఇచ్చారు. అలాగే ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఆడట్లేదు అని కూడా చెప్పించాడు నాగ్. ఈ సందర్భంగా శోభాశెట్టి కోసం వాళ్ళ నాన్నతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. మూడేళ్ళ నుంచి దాచిన వాళ్ళిద్దరి లవ్ స్టోరీని బయటపెట్టేసాడు ఆమె బాయ్ ఫ్రెండ్ యశ్వంత్.

Also Read : Celebrity Look : ఎన్టీఆర్ ఫ్యామిలీ దివాళీ.. దీపాల వెలుగుల్లో అనుపమ.. శ్రీవారుతో కియారా పిక్స్..

మధ్యమధ్యలో నామినేషన్స్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేసుకుంటూ వచ్చాడు నాగార్జున. చివరగా యావర్, భోలే నిలవగా భోలే ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగ్. దీంతో భోలే హౌస్ నుంచి బయటకి వచ్చేసాడు. భోలే వెళ్లిపోవడంతో తనకు తోడు ఎవ్వరూ లేరని అశ్విని బాధపడుతూ ఏడ్చింది. ఇక హౌస్ లో దీపావళి ఎపిసోడ్ కావడంతో రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. శ్రీలీల, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ లోకి వచ్చారు. కాజల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చింది. అలాగే బుచ్చిబాబు సాన, హైపర్ ఆది కూడా బిగ్‌బాస్ లోకి వచ్చి సందడి చేశారు.