Bigg Boss 7 : బిగ్‌బాస్‌లో చొరబడ్డ క్రిమినల్ దొరికాడు.. హంతకుడు ఎవరో తెలుసా..?

బిగ్‌బాస్ గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగింది. బిగ్‌బాస్‌లో చొరబడ్డ క్రిమినల్ ఎవరు..?

Bigg Boss 7 : బిగ్‌బాస్‌లో చొరబడ్డ క్రిమినల్ దొరికాడు.. హంతకుడు ఎవరో తెలుసా..?

Bigg Boss 7 Day 81 Highlights Secret and Investigation Tasks

Updated On : November 24, 2023 / 7:48 AM IST

Bigg Boss 7 : బిగ్‌బాస్ బుధవారం నాడు మర్డర్ మిస్టరీ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో ఒక వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ లో హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హంతుకుడు ఎవరు అనేది కనిపెట్టి అరెస్ట్ చేయాలి. ఇక ఈ టాస్క్ లో భాగంగా ఒకొక్కరికి ఒక్కో రోల్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈక్రమంలోనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్‌గా అర్జున్-అమర్ దీప్, మీడియా రిపోర్టర్స్‌గా అశ్విని-శోభాశెట్టి, సీక్రెట్ ప్రేమ జంటగా రతిక-గౌతమ్, పనిమనుషులుగా యావర్-ప్రియాంక, హంతకుడిగా శివాజీకి రోల్స్ ఇచ్చాడు.

ఇక టాస్క్ లో భాగంగా ఎవరికి వారు.. వారివారి పాత్రలను పోషించడం మొదలుపెట్టారు. గురువారం నాడు జరిగిన ఎపిసోడ్ లో శివాజీ సక్సెస్‌ఫుల్ గా రెండు మర్డర్స్ ని చేసేశారు. ఆ తరువాత గౌతమ్ ని మర్డర్ చేయమని శివాజీకి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ మర్డర్ చేయడానికి శివాజీ, గౌతమ్ కి ఒక స్టికర్ అంటించాల్సి ఉంటుంది. అయితే ఇచ్చిన సమయంలో శివాజీ అది చేయలేకపోయారు. దీంతో శివాజీని ఆ పని నుంచి తప్పుకోమని, ఆ పనిని ఎవరికి తెలియకుండా ప్రియాంకకు అప్పగించాలని కోరాడు.

Also read : Dhruva Natchathiram : రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..

శివాజీ బిగ్‌బాస్ చెప్పినట్లు ఆ పని ప్రియాంకకు అప్పజెప్పారు. ఇక ఆ పనిని ప్రియాంక ఎవరికి అనుమానం కలగకుండా చాలా సింపుల్ గా చేసేశారు. ఇక ఈ గ్యాప్ లో పోలీస్ ఆఫీసర్స్ అయిన అమర్, అర్జున్‌లకు శివాజీ పై అనుమానం వచ్చింది. ఇక ఇది గ్రహించిన శివాజీ వెంటనే పారిపోయి బాత్రూమ్‌లో దాకున్నారు. అయితే చిరాకరికి శివాజీ పోలీసులకు లొంగిపోవడంతో గురువారం ఎపిసోడ్ చాలా సరదాగా గడిచిపోయింది. కాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.