Bigg Boss 7 Day 87 : సీరియల్ బ్యాచ్ నుంచి ప్రియాంక అవుట్.. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్..

'టికెట్ టూ ఫినాలే' అంటూ బిగ్‌బాస్ హోరాహోరుగా జరుగుతుంది. మరి బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి..?

Bigg Boss 7 Day 87 : సీరియల్ బ్యాచ్ నుంచి ప్రియాంక అవుట్.. బుధవారం ఎపిసోడ్ హైలైట్స్..

Bigg Boss 7 Day 87 Highlights Ticket to Finale games

Bigg Boss 7 Day 87 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో ప్రస్తుతం ఫినాలే టికెట్ కోసం పోటీ జరుగుతుంది. ఫినాలేకి మరో రెండు వారలు సమయం ఉంది. అయితే ఫినాలేలో నిలిచే మొదటి కంటెస్టెంట్ కి ఇప్పటినుంచే పోటీ పెట్టేశారు. ‘టికెట్ టూ ఫినాలే’ అంటూ వరుస టాస్క్‌లు ఇస్తూ వస్తున్నాడు బిగ్‌బాస్. ఈ టికెట్ టూ ఫినాలేలో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో మూడు గేమ్స్ పెట్టాడు. ఆ గేమ్స్ అర్జున్ టాప్ ప్లేస్ ని అందుకున్నారు. ఇక లీస్ట్ పొజిషన్ లో ఉన్న శివాజీ, శోభాని టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు.

అంతేకాదు వారు సంబంధించిన పాయింట్స్ ని ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఇవ్వాలని చెప్పడంతో ఇద్దరు అమర్ కి ఇచ్చారు. ఇక బుధవారం కూడా ‘ఎత్తరా జెండా’, ‘గెస్ చేయ్ గురూ’ అంటూ రెండు గేమ్స్ పెట్టాడు. ‘ఎత్తరా జెండా’ గేమ్ లో ప్రశాంత్, యావర్, అర్జున్ తొలి మూడు స్థానాలు సంపాదించుకున్నారు. ‘గెస్ చేయ్ గురూ’ గేమ్ మాత్రం అర్జున్ టాప్ పొజిషన్ ని సంపాదించుకున్నారు. ఇక ఈ ఐదు గేమ్స్ కంప్లీట్ అయిన తరువాత ప్రియాంక తక్కువ పాయింట్స్ తో చివరి స్థానంలో నిలిచింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను కూడా ఈ రేస్ నుంచి తప్పించాడు.

Also read : War 2 Updates : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడో తెలుసా..?

ఇక ఆమె దగ్గర ఉన్న పాయింట్స్ లో సగం ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఇవ్వాలని కోరగా.. ప్రియాంక గౌతమ్ కి ఇచ్చింది. దీంతో అమర్ బాగా ఫీల్ అయ్యారు. సీరియల్ బ్యాచ్ లో ఒక మెంబెర్, అమర్ స్నేహితురాలు కాబట్టి అతనికే ఇస్తుందని ఆడియన్స్ తో పాటు అమర్ కూడా భావించారు. కానీ ప్రియాంక, గౌతమ్ కి ఇవ్వడంతో సీరియల్ బ్యాచ్ లో చీలిక ఒచ్చింది. అమర్, శోభా ఒకటయ్యారు. ప్రియాంక ఒకటిగా నిలిచారు. కాగా ఈ గేమ్స్ విషయంలో, ప్రియాంక తనకే పాయింట్స్ ఇవ్వాలి అనే విషయంలో అమర్ చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తూ కనిపించారు.

కాగా ‘టికెట్ టూ ఫినాలే’ రేసులో కంటెస్టెంట్స్ స్థానాలు చూసుకుంటే.. మొదటి మూడు స్థానాల్లో అమర్, అర్జున్, గౌతమ్ ఉన్నారు. మరి ఈరోజు జరిగే గేమ్స్ లో యావర్, ప్రశాంత్ ఈ మూడు ప్లేసుల్లో ఏమన్నా చేరతారా అనేది చూడాలి. కాగా ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి నిలిచారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.