War 2 Updates : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడో తెలుసా..?
హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని..
![War 2 Updates : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడో తెలుసా..? War 2 Updates : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/11/Hrithik-Roshan-NTR-spy-universe-movie-war-2-release-date-update.jpg)
Hrithik Roshan NTR spy universe movie war 2 release date update
War 2 Updates : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకొని మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అయితే హీరోలు లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది. హీరోలు లేని సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్రీకరించారు. త్వరలోనే హృతిక అండ్ ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అని అభిమానులంతా ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజాగా వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలియజేశారు. ఈ చిత్రం 2024లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ అభిమానుల ఎదురుచూపులను మరికొంచెం పొడిగిస్తూ.. ఈ మూవీ రిలీజ్ 2025కి వెళ్ళింది. ఆగష్టు 14న 2025లో ఈ మూవీ రిలీజ్ కానుందట. ఆ రిలీజ్ డేట్ లాంగ్ వీకెండ్ తో వస్తుంది. 14న గురువారం నాడు మూవీ రిలీజ్ అవుతుంది. 15న ఇండిపెండెన్స్ డే హాలిడే, 16,17 వీకెండ్. దీంతో వార్ 2కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Also read : Sandeep Vanga : బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ వంగా రియాక్షన్.. ఆయనకి ఏజ్ అయ్యిపోయింది..
#BreakingNews… YRF ANNOUNCES ‘WAR 2’ RELEASE DATE: INDEPENDENCE DAY WEEKEND 2025… The sixth film from #YRFSpyUniverse – #War2 – now has a release date… Get ready for mayhem at the #Boxoffice on 14 Aug 2025 [Thursday]… #AyanMukerji directs the film that’s produced by #YRF. pic.twitter.com/dHQ6BHQ9Es
— taran adarsh (@taran_adarsh) November 29, 2023
కాగా ఈ మూవీ YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నాడని సమాచారం. స్పై యూనివర్స్ మొత్తానికి ఎన్టీఆర్ మెయిన్ విలన్ కాబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమాటిక్ యూనివర్స్ లో హీరోలుగా ఉన్న సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ ని ఓడించడానికి కలిసి పోరాటం చేయనున్నారట. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ 3 చివరిలో ఒక కొత్త విలన్ గురించి ఆడియన్స్ కి తెలియజేశారు. ఆ విలన్ ఎన్టీఆర్ అంటున్నారు.